అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందరూ చూడముచ్చటైన జంటని దీవించారు. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. దీంతో కుటుంబ పెద్దలు ఫస్ట్ నైట్ కార్యం కోసం ముహూర్తం చూసి ఏర్పాటు చేశారు. కానీ ఆ యువకుడు కార్యానికి భయపడి ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నాడు. వివరాలు ఏంటో చూద్దామా.. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి లోని మాచర్ల రింగ్ రోడ్డు ప్రాంతం ఇదే గ్రామానికి చెందిన పత్తికొడుపు కిరణ్ కుమార్ అనే యువకుడికి ఈ మధ్యకాలంలోనే, తెనాలికి చెందిన యువతి తో వివాహమైంది.
also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆందోళన చెందకూడదు
Advertisement
వివాహం తర్వాత భార్యను తీసుకొని మాచర్ల వెళ్ళాడు యువకుడు. ఆ తర్వాత వారింట్లో మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. ఇంతలో తినాలి వెళ్లేందుకు బయలుదేరిన కిరణ్ కుమార్ గుంటూరు బస్ స్టాప్ లో తన భార్యను ఉంచి ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్ళాడు. గంటలు గడిచింది అయినా భర్త రాలేదు. ఆమె బస్ స్టాప్ లోనే ఎదురుచూస్తోంది. సాయంకాలమైంది అయినా భర్త రాలేదు ఆమె అక్కడే ఉంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. చివరికి ఏం చేయాలో తెలియక నేరుగా అత్తవారింటికి వెళ్లి విషయం అంతా చెప్పింది.
Advertisement
also read:TS Inter Results 2023 : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే…!
ఆరోజు రాత్రి కూడా కిరణ్ కుమార్ రాలేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో కృష్ణ నది ఎగువ ప్రాంతంలో కిరణ్ కుమార్ మృతదేహం సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించారు. కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమారుడు ఫస్ట్ నైట్ అంటే భయపడ్డాడని, అందుకే ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు విలపించారు.
also read:షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?