Home » చందమామ మూవీలో హీరో అతనేనట.. షూటింగ్ చేసి మరీ తీసేశారట..!!

చందమామ మూవీలో హీరో అతనేనట.. షూటింగ్ చేసి మరీ తీసేశారట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చందమామ సినిమా అంటే తెలియని వారు ఉండరు.. ఈ మూవీ గురించి ఈ హీరో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతను ఎవరో ఒకసారి చూడండి..!! గూడచారి, ఎవరు, క్షణం వంటి సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకున్న హీరో అడవి శేషు.. ప్రస్తుతం ఆయన మేజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అడవి శేషు ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు.. తాజాగా ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రోమోలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు శేషు.

Advertisement

 

తాను 2000 సంవత్సరం నుంచే సినిమా ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను అని తెలియజేశారు. మొదటిసారి ‘సొంతం’ మూవీ లో పెద్ద రోల్ అని చెప్పి తీసుకొని 5 సెకండ్స్ మాత్రమే కనబడే పాత్ర ఇచ్చారన్నారు. 2007వ సంవత్సరంలో శివబాలాజీ నవదీప్ కాంబినేషన్ లో వచ్చిన చందమామ మూవీ లో మెయిన్ పాత్రలో నవదీప్ క్యారెక్టర్ కి మొదట నన్ను తీసుకున్నారు. రెండు రోజులు షూటింగ్ కూడా చేశారు.. తర్వాత ఎందుకో బాగో లేదని చెప్పేసి నన్ను తీసేసారు అని తెలియజేశారు.

Advertisement

నా అసలు పేరు సన్నీ కృష్ణ అని, దీంతో చాలామంది నన్ను సన్నీలియోన్ అంటూ ఏడిపిస్తుంటే శేషుగా పేరు మార్చుకున్నానని చెప్పాడు. మరి అమెరికాలోనే హీరోగా లేదా యాక్టర్ గా ఎందుకు ప్రయత్నం చేయలేదని అడగగా.. అమెరికాలో భారతీయులకు పెట్రోల్ బంక్ లో పని చేసే వ్యక్తిగానో,టెర్రరిస్ట్ లాంటి చిన్న పాత్రలు ఇస్తారని, హాలీవుడ్లో ఇండియన్ హీరోలు పని చేయలేరని అన్నారు.. ఇప్పటికి ఇండియా నుంచి ఎక్కువగా పాపులర్ అయిన వ్యక్తులు కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారని వివరించారు.

also read;

ఉల్లిపాయల్ని, వెల్లుల్లిని దైవ ప్రసాదాల్లో ఎందుకు ఉపయోగించరో తెలుసా..!!

ప్రైవేట్ వీడియోలు బ‌య‌ట‌పెడ‌తాన‌న‌డంతో.. ప్రియుడిని మ‌ట్టుపెట్టించిన ప్రియురాలు..!

 

Visitors Are Also Reading