Home » Ts congress:తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పు..ఆయన తొలగింపుకు రంగం సిద్ధమైందా..?

Ts congress:తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పు..ఆయన తొలగింపుకు రంగం సిద్ధమైందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రం లాంటి పార్టీ.. ఎందరో సీనియర్ లీడర్లు ఇందులో ఉన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన పార్టీకి గల్లి నుంచి ఢిల్లీ వరకు ఎప్పుడు ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి ఈ కాంగ్రెస్ పార్టీలో తాజాగా తెలంగాణలో వివాదం చోటుచేసుకుంది. చిలికి చిలికి గాలి వానలా మారిన ఈ వివాదం ఢిల్లీ పెద్దల వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కీలక నేతలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారితో పలు సమావేశాలు నిర్వహించి చర్చించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

also read;ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారిందంటే ?

ఒక నివేదిక తయారు చేసి అధిష్టానానికి అందించినట్లు తెలుస్తోంది.. ఇంతకీ ఆ నివేదికలో ఏముంది.. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కాస్త మార్పు వచ్చింది అనుకున్న సమయంలోనే, మళ్లీ పార్టీలో ఉన్నటువంటి కొందరు సీనియర్లతో ఇబ్బంది వచ్చి పడింది. రేవంత్ తో వారికి అస్సలు సెట్ అవడం లేదని ఈ మధ్య జరిగిన వివాదాన్ని చూస్తే అర్థమవుతుంది. దీంతో హై కమాండ్ సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో దిగ్విజయ్ సింగ్ వారితో చర్చలు జరిపి ఒక నివేదిక తయారు చేసుకొని ఢిల్లీ పెద్దలకు సమర్పించారు..

Advertisement

ఈ నివేదిక ప్రకారం చూస్తే కాంగ్రెస్ సీనియర్లంతా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ పై ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. మా ఇన్చార్జిని మారిస్తేనే మాకు సెట్ అవుతుందని వారు అన్నట్టు సమాచారం. దీంతో ఢిల్లీ అధిష్టానం మరో ఇన్చార్జి కోసం అన్వేషణ మొదలు పెట్టిందని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జి రేస్ లో హర్యానాకు చెందిన దళిత నేత పునియా కూడా ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏది ఏమైనా సీనియర్లకు మాత్రం దిగ్విజయ్ సింగ్ ఒక సూచన కూడా చేసినట్టు తెలుస్తోంది. ఎన్ని గొడవలు వచ్చినా లోలోపలే చర్చించుకోవాలి కానీ, బహిరంగంగా గొడవలకు దిగకూడదని సూచించారని సమాచారం.

also read;Optiocal illusion: మీ కళ్ళకు పరీక్ష..ఈ ఫోటోలో చిరుత దాగుంది.. ఎక్కడుందో కనుక్కోండి..?

Visitors Are Also Reading