Home » పాపం.. క్యాచ్ కోసం ప్రయత్నించి మూతి పళ్ళు రాలగొట్టుకున్నాడు.. అయినా పట్టు వదలలేదు..!

పాపం.. క్యాచ్ కోసం ప్రయత్నించి మూతి పళ్ళు రాలగొట్టుకున్నాడు.. అయినా పట్టు వదలలేదు..!

by Anji
Ad

సాధారణంగా క్రికెట్ లో క్యాచెస్ మిస్ చేస్తే మ్యాచ్ ఫలితమే మారిపోతుంది. ఈ విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. ఇందుకు ఓ సామెత కూడా చెబుతుంటారు. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అని పలు సందర్భాల్లో పేర్కొంటుంటారు. చాలా ఒత్తిడితో సాగే క్రికెట్ గేమ్ లో క్యాచ్ లు పట్టడం అంత తేలికేమి కాదు. ఒక్కోసారి కష్టసాధ్యమైన క్యాచ్ లను చాలా తేలికగా పడుతుంటారు. 

Advertisement

అదే సమయంలో చాలా సులభతరమైన క్యాచ్ లను కూడా జారవిడుస్తుంటారు. క్యాచ్ ల విషయంలో ఒక్కోసారి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. బంతిని అందుకునే సమయంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కూడా చేరాల్సి వస్తుంది. తాజాగా శ్రీలంక స్టార్ క్రికెటర్ చమిక కరుణరత్నే పరిస్థితి కూడా ఇలాంటిదే. ప్రస్తుతం అతను లంక ప్రీమియర్ కూడా ఇలాంటిదే. ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్ లో ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ లో క్యాచ్ పట్టుకునే ప్రయత్నం అతని మూతి పళ్లు 4 విరిగిపోయాయి. అంతేకాదు.. రక్తం ధరలా కారింది. అయినప్పటికీ బంతిని మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. చేతితో రక్తం కారకుండా ముఖాన్ని అడ్డుపెట్టుకున్నాడు. ఆ తరువాత డగౌట్ కి వెళ్లి ప్రథమ చికిత్స తీసుకున్నాడు. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read :   బాలకృష్ణతో హ్యాట్రిక్ కొట్టిన దర్శకులు.. ఎవరో తెలుసా..?

Advertisement

Manam News

లంక ప్రీమియర్ లీగ్ లో గ్లాడియేటర్స్, కాండీ ఫాల్కన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ విషాద ఘటన జరిగింది. గాలె గ్లాడియేటర్ ఇన్నింగ్స్ సమయంలో నువిందు ఫెర్నాండో ఇచ్చిన క్యాచ్ ని అందుకునేందుకు కరుణరత్నే పరుగెత్తుకొచ్చాడు. అదే సమయంలో సమీపంలో ఉన్నటువంటి మరో ఇద్దరూ ఫీల్డర్లు కూడా పట్టుకునేందుకు వచ్చారు. వారిని చూసిన కరుణరత్నే దగ్గరకు రావద్దని వారించాడు. క్యాచ్ ని పట్టుకుంటున్న సమయంలో దురదృష్టవశాత్తు బంతి అతని మోహంపై బలంగా తాకింది. దీంతో మూతి పళ్లు ఊడిపోయి రక్తం ధారలా కారిపోయింది. పళ్లు పూర్తిగా విరిగిపోయాయని సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ లో కాండీ ఫాల్కన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ ని ఛేదించింది. 

Also Read :  కెప్టెన్సీ నిషేదం విషయంలో కీలక ప్రకటన చేసిన డేవిడ్ వార్నర్.. భావోద్వేగ పోస్ట్ కు కారణం అదేనా ?

 

Visitors Are Also Reading