Home » ల‌క్ష్మ‌ణుడు లేని రామాల‌యం మీరు చూశారా..? ఎక్క‌డుందంటే..?

ల‌క్ష్మ‌ణుడు లేని రామాల‌యం మీరు చూశారా..? ఎక్క‌డుందంటే..?

by Anji
Ad

భార‌త‌దేశంలో శ్రీ‌సీతారామ‌చంద్ర‌స్వామి వారి ఆల‌యాలు చాలానే ఉన్నాయి. కానీ హ‌నుమంతుడు సీత సమేతంగా శ్రీ‌రాముడు విగ్ర‌హాలు మాత్ర‌మే ఉండి ల‌క్ష్మ‌ణుడి విగ్ర‌హం లేకుండా ఏ దేవాల‌యం ఉండదు. కానీ దేశం మొత్తంలో ఒక్క‌చోటే ఈ ఆల‌యం ఉంది. ఎక్క‌డంటే.. ఎల్ల‌ప్పుడు రాముడికి తోడు నీడ‌గా ఉండే లక్ష్మ‌ణుడు లేకుండానే తెలంగాణ‌లో నిజామాబాద్ జిల్లా ఇంద‌ల్వాయి గ్రామంలో ఓ రామాల‌యం ఉన్న‌ది. మిగ‌తా ఆల‌యాల‌తో పోల్చితే ఈ రామాల‌యానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఈ ఆల‌యంలో లక్ష్మ‌ణుడు లేకుండానే హ‌నుమంతుడు సీత స‌మేతంగా శ్రీ‌రాముడు కొలువుదీరాడు.


ఒక సారి ఈ ఆల‌యం చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే సుమారు రెండు వంద‌ల యాబై సంవ‌త్స‌రాల క్రితం రెడ్డి రాజుల కాలంలో శీలం జాన‌కి బాయి వంశీయుల నిర్మించిన‌ట్టు చరిత్ర ఆధారాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు.. కాశీ చరిత్ర అనే పుస్త‌కంలో ఏనుగుల వీర‌స్వామి అనే సుప్రీకోర్టు జ‌డ్జీ మ‌ద్రాస్ నుంచి కాశీ యాత్ర‌గా వెళ్తూ 1830 జులై 22న ఇంద‌ల్వాయి ఆల‌యాన్ని సంద‌ర్శించిన‌ట్టు కూడా పేర్కొన‌బ‌డింది. ఈ ఆల‌యం చుట్టూ 30 మంది బ్రాహ్మ‌ణుల అగ్ర‌హారం ఉండేద‌ని పూర్వికుల ద్వారా తెలుస్తుంది. దీనిని ప‌రిశీలించిన ఆయ‌న అప్ప‌టి నిజాం న‌వాబ్‌ల ధాటికి త‌ట్టుకుని బుర‌ద‌లో క‌మలం వ‌లే విక‌సిస్తున్న ఆల‌యం అని.. ఆ కాశీ చ‌రిత్ర పుస్త‌కంలో పేర్కొన్న‌ట్టు చ‌రిత్ర చ‌దివిన వారు చెబుతున్నారు.

Advertisement

Advertisement


ఇక అక్క‌డ వెలిసిన మూల‌విగ్ర‌హం ఏడు అడుగుల ఎత్తులో ఉంటూ చుట్టూ ద‌శ‌వ‌తారాల‌తో పాటు సీత‌మ్మ త‌ల్లిని తొడ‌పై కూర్చుండ‌బెట్టుకుని శ్రీ‌రాముడు ఏక‌శిల విగ్ర‌హంగా కొలువుదీరి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌డం విశేషం. ఈ దేవాల‌యం సీతాస‌మేతంగా శ్రీ‌రాముడు హ‌నుమంతుడు ఉండి ల‌క్ష్మ‌ణుడు లేని దేవాల‌యంగా ప్ర‌జ‌లలో ప్రాచుర్యం పొందింది. వేల కొల‌ది రామాల‌యాలు ఉన్న మ‌న దేశంలో ల‌క్ష్మ‌ణుడు లేని ఏకైక రామాల‌యం ఇదే హిందువు ప్ర‌ముఖులు పేర్కొంటున్నారు. ఈ దేవాల‌యం ఈ మ‌ధ్య నిర్మించిన‌ది కాదు.. ఏకంగా 250 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాల‌యం అద్భుత‌మైన క‌ట్ట‌డంతో గుర్తింపు పొందింది.


ఇక ఈ దేవాల‌యంలో ల‌క్ష్మ‌ణుడు ఎందుకు లేడ‌నే విష‌యంపై ర‌క‌ర‌కాల కార‌ణాలు చెబుతున్నారు స్థానికులు. శ్రీ‌రామ‌చంద్రుల వారు ఆరు అడుగుల ఆజానుబాహు రూపంలో ఉంటాడు. ఇక్క‌డ ల‌క్ష్మ‌ణుడు లేని శ్రీ‌రామ చంద్రుడిని ప్ర‌ముఖ హిందూ ప‌రిర‌క్ష‌కులు శివాజీ గురువు స‌మ‌ర్థ రామ‌దాసు ప్ర‌తిష్టించారు. ఆయ‌న ఎన్నో దేవాల‌యాల్లో విగ్ర‌హ ప్ర‌తిష్ట చేసారు. స్థానిక ప‌రిస్థితులు, విశిష్ట‌త‌ల నేప‌థ్యంలో లక్ష్మ‌ణుడు లేకుండానే శ్రీ‌రాముడి విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని భావించాడు. శ్రీ‌రామ‌చంద్రుల వారు ఆయ‌న క‌ల‌లోకి వచ్చి ల‌క్ష్మ‌ణుడు లేకుండానే విగ్ర‌హావిష్క‌ర‌ణ చేయాల్సిందిగా చెప్పాడ‌ని కొంద‌రూ పేర్కొంటున్నారు. మొత్తానికి ల‌క్ష్మ‌ణుడు లేని ఈ రామాల‌యం దేశంలోనే ఓ ప్ర‌త్యేక‌మ‌ని భావించి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌రిలి వ‌స్తున్నారు.

Also Read : 

బ్రహ్మానందం ఒక్కో సినిమాకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా…?

బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ సీనియ‌ర్‌ నటీమణి

Visitors Are Also Reading