నటి గోపిక గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన నా ఆటోగ్రాఫ్ చిత్రంలో ఓ కీలకపాత్రలో ఆమె నటించారు. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. అయితే ఆమెకు అనుకున్న రేంజ్లో ఆదరణ లభించలేదు. గోపిక అసలు పేరు గర్లీ ఆంటో. అయితే ఆమె ఫిబ్రవరి 01, 1984లో జన్మించింది. గోపిక ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటించింది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆమె మలయాళ చిత్రం ప్రణయమణిథూవల్ (2002). ఆ తర్వాత తమిళం, తెలుగు మరియు కన్నడ చిత్ర పరిశ్రమలలో కూడా రాణించింది.
Advertisement
సౌత్ చిత్రాల్లో మంచి నటనతో పాటు.. అందంతో కూడా అదరగొట్టిన గోపిక.. 2008లో డాక్టర్ అజిలేష్ చాకోను పెళ్లి చేసుకుంది. వీరికి 2 మంది పిల్లలు. పెళ్లి తర్వాత గోపిక కుటుంబంతో గడుపుతోంది. గోపిక తన కుటుంబంతో ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోపిక సిరో మలబార్ కాథలిక్ కుటుంబంలో ఆంటో ఫ్రాన్సిస్, టెస్సీ ఆంటోలకు జన్మించింది. ఒల్లూరులోని సెయింట్ రాఫెల్స్ కాన్వెంట్ గర్ల్స్ హై స్కూల్లో 12వ తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, కాలికట్ యూనివర్సిటీలో సోషియాలజీలో డిగ్రీ చదివింది.
Advertisement
తులసి దాస్ దర్శకత్వంలో జయసూర్య, వినీత్‌లతో కలిసి నటించిన ఆమె మొదటి చిత్రం ప్రణయమణిథూవల్. అంతగా ఆడలేదు. అయితే ఆమెకు మాత్రం కావాల్సినంత గుర్తింపు లభించింది. ఆమె రెండో చిత్రం 4 ది పీపుల్. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అంతేకాదు.. పలు భారతీయ భాషలలో డబ్ అయ్యింది. దీనికి జయరాజ్ దర్శకత్వం వహించారు. ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 17 జూలై 2008న, గోపిక ఉత్తర ఐర్లాండ్‌లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేష్ చాకోను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం గోపిక తన భర్త, పిల్లలతో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో స్థిరపడినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!