Home » 10 పాసయ్యారా..టీటీడీలో ఉద్యోగాలు అంటూ..జీతం లక్షల్లోనే..నిజమేనా..?

10 పాసయ్యారా..టీటీడీలో ఉద్యోగాలు అంటూ..జీతం లక్షల్లోనే..నిజమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టెక్నాలజీ భారీగా పెరిగిన తరుణంలో దీంతో మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, కాస్త జాగ్రత్త వహించకుంటే నష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఇలాంటి టెక్నాలజీని వాడుకొని ఎంతోమంది సైబర్ నెరగాళ్లు అమాయక జనాలను మోసం చేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఫోన్ పే, గూగుల్ పే వివిధ అకౌంట్లో ద్వారా డబ్బులు దొబ్బేసిన వీరు, ప్రస్తుతం ఉద్యోగాల పేరుతో పైరవీలు చేస్తూ యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు.. వీరిని నమ్మారంటే చాలు నీ జీవితం బుగ్గిపాలవుతుంది.. పూర్తి వివరాలు ఏంటో చూద్దామా..

Advertisement

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పది పాస్ అయితే చాలు లక్షల రూపాయల జీతం ఇస్తామని టిటిడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఒక వార్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన ఎంతోమంది నిరుద్యోగులు మోసాల బారిన పడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన సరే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటున్నారు. మరి దీనిపై స్పందించిన టిటిడి బోర్డు ఏమందో ఇప్పుడు చూద్దాం.. టీటీడీలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఇలాంటి ఫేక్ ప్రకటనలు నిరుద్యోగులు నమ్మి మోసపోవద్దని సందీప్ కోరారు.

Advertisement

ఒకవేళ టీటీడీలో ఉద్యోగాలు ఉంటే httsps://www.tirumala.org/ ద్వారా ధ్రువీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఇలాంటి ఫేక్ వెబ్సైట్లు ఇట్లాగే ప్రచారం చేశాయని, అలాంటి 43 ఫేక్ వెబ్సైట్లపై టిటిడి కి అందిన ఫిర్యాదు మేరకు వారిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారని అన్నారు. ఏది ఏమైనా నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని, నేరగాళ్లు వివిధ రకాలుగా ఆశ పెడుతూ లక్షల్లో డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తారని తెలియజేశారు. ఇలాంటి ప్రకటనలు ఏమైనా కనిపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading