కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు అట్లీ ఒకరు. రాజా రాణి మూవీ ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అట్లీ. ఈయన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించారు. ఇక ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సాధించడం విశేషం. తాజాగా అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Ad
ఇక అట్లీ దర్శకత్వం లో వచ్చినటువంటి సినిమాల గురించి ఒకసారి ఆలోచిస్తే.. ఓ ఆసక్తికరమైన న్యూస్ ప్రస్తుతం వెలుగులోకి వస్తుంది. అట్లీ దర్శకత్వం వహించిన సినిమాలన్నింటిలో కూడా హీరోయిన్స్ చనిపోయే విధంగా ఈయన సినిమాలను తీస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్స్ చనిపోతేనే.. ఈయన సినిమాలు హిట్ అవుతాయా అనే విధంగా ఈయన సినిమాలు ఉంటాయని చెప్పాలి. ఈయన దర్శకుడిగా తెరకెక్కించిన మొట్టమొదటి చిత్రం రాజారాణి మూవీలో నజ్రియా కారు యాక్సిడెంట్లో చనిపోతుంది. ఈ సీన్ ని ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో కలిచి వేసిందని చెప్పాలి. రెండో సినిమాలో తెరి ఈ సినిమాలో బుల్లెట్ తగిలి సమంత మరణించే విధంగా చూపించారు.
మెర్సల్ సినిమాలు నిత్యమీనన్ పాత్ర చనిపోయే విధంగా చూపించారు. తాజాగా జవాన్ సినిమాలో కూడా హీరోయిన్ దీపిక పదుకొనే పాత్ర చనిపోయే విధంగా చూపించారు ఈ సినిమాలో దీపికా పదుకొనే సీనియర్ షారుక్ ఖాన్ కి భార్యగా కనిపించారు ముగింపు పలికారు. కమర్షియల్ సినిమాలో కథానాయకుల పాత్రలకు రాజోలి ఎండింగ్ ఇవ్వడం అట్లీ స్టైల్ కథకు ప్రేక్షకులకు మధ్య ఎమోషనల్ కనెక్ట్ కోసం హీరోయిన్లను ఆయన అలా చంపేస్తున్నారని అందుకే ఆయన సినిమాలు కూడా మంచి సక్సెస్ అవుతున్నాయని చెప్పవచ్చు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
దేవుళ్ళు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నటించిన చిన్నారి మీకు గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?
Advertisement
ఈ హీరోల నిర్లక్ష్యంగా మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఇవే..!