Home » మీ క‌ల‌లో ఇలాంటి మ‌హిళ‌లు క‌నిపించారా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

మీ క‌ల‌లో ఇలాంటి మ‌హిళ‌లు క‌నిపించారా..? అయితే ఏం జ‌రుగుతుందంటే..?

by Anji
Ad

నిద్ర‌లో క‌నిపించే ప్ర‌తి క‌ల ఏదో ఒక సందేశాన్నిస్తుంది. ఈ క‌ల‌లు భ‌విష్య‌త్‌లో జ‌రిగే ఘ‌ట‌న‌ల గురించి మ‌న‌ల్ని హెచ్చ‌రిస్తాయి. ఈ కల‌లు కొన్ని చాలా బాధ‌క‌ర‌మైన‌వి. కొన్ని కీల‌క‌మైన‌వి. మ‌నిషి మ‌న‌సు ఎప్పుడు నిద్ర‌పోదు. శ‌రీరం నిద్ర‌లోకి జార‌కున్న‌ప్పుడు మ‌న‌సు అక్క‌డ‌క్క‌డ తిరుగుతూ క‌ల‌లు రావ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. బ్ర‌హ్మ‌ముహుర్తంలో స్వ‌ప్నం క‌నిపిస్తే వారం రోజుల లోపే ఆ క‌ల నెర‌వేరుతుంది. అంత‌కు ముందు క‌ల ఫ‌లితాలు రావ‌డానికి నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంది. క‌ల‌లో స్త్రీల‌ను చూడ‌డం వ‌ల్ల శుభ‌, అశుభ ఫ‌లితాలుంటాయి. స్త్రీలు క‌ల‌లో క‌నిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


క‌ల‌లో వృద్ధురాలిని చూడ‌డం

Advertisement

ఒక వ్య‌క్తి క‌ల‌లో వృద్ధురాలిని చూస్తే అది శుభ‌ప్ర‌దంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. క‌ల‌ల గ్రంథం ప్ర‌కారం.. వృద్ధ స్త్రీల‌ను క‌ల‌లో చూడ‌డం రాబోయే కాలంల మీరు సంప‌ద గౌర‌వాన్ని పొంద‌గ‌ల‌రు అని సంకేతం వృద్ధ స్త్రీల‌ను క‌ల‌లో చూడ‌డం రాబోయే కాలంలో మీరు సంప‌ద, గౌర‌వాన్ని పొంద‌గ‌ల‌ర‌ని సంకేతం.

Advertisement

న‌గ‌లు ధ‌రించిన స్త్రీల‌ను చూడ‌డం

ఒక వ్య‌క్తి క‌ల‌లో న‌గ‌లు ధరించిన స్త్రీని చూస్తే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని ప‌నులు పూర్తి చేయ‌బోతున్నాయ‌ని అర్థం. అత‌డు లేదా ఆమె స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాలి. ఇలా చేయ‌డం మీ ప‌నిలో ఆశించిన విజ‌యాన్ని పొందుతారు.

అంద‌మైన స్త్రీల స్వ‌రూపం

ఒక వ్య‌క్తి క‌ల‌లో అంద‌మైన స్త్రీ లేదా దేవ‌దూత‌ను చూస్తే.. అది కూడా శుభ సంకేతంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. అస‌మ్మ‌తిని వ‌దిలించుకోవాల‌ని సూచిస్తుంది. దీంతో పాటు ఇంట్లో ఆనందం, శాంతి కూడా ఉంటుంది. అదే స‌మ‌యంలో ఆర్థిక ప‌రిస్థితి కూడా మెరుగుప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

లాఫింగ్ లేడీ

ఒక స్త్రీ చెడుగా న‌వ్వుతూ క‌నిపిస్తే ఆ వ్య‌క్తి జీవితంలో ఇబ్బంది ఉంటుంది. అయితే ఓ స్త్రీ క‌ల‌లో న‌వ్వుతూ క‌నిపిస్తే త్వ‌ర‌లో వారి జీవితంలో డ‌బ్బు వ‌స్తుంది.

Also Read : 

ఆకాశంలో న‌ల్ల‌ని మ‌బ్బులు, మెరుపులు ఎప్పుడైనా చూశారా..! పిడుగులు ప‌డ‌వ‌చ్చు జాగ్ర‌త్త‌..!

 

Visitors Are Also Reading