సాధారణంగా లవ్ లో పడ్డ యువతి యువకులు ఒక్కోసారి మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ చెప్పుకుంటారు. ఈ మనస్పర్ధలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఏ కారణమైన సరే వారికి రిలేషన్ సెట్ కాదు అనిపిస్తే తప్పనిసరిగా బ్రేకప్ చెప్పుకొని విడిపోతుంటారు. అయితే ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చాక చాలా బాధపడి పోతారు. వాటి నుంచి బయట పడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ నాలుగు విషయాల్లో అస్సలు తొందర పడవద్దు అని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దామా..
also read:శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయి ఇన్ని నెలలైనా పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా..?
Advertisement
జీవితంలో అతి ముఖ్యమైన విషయాల్లో రిలేషన్ కూడా ఒకటి. ఎవరితో కలవాలన్నా విడిపోవాలన్నా తొందర పడవద్దు. కాసేపు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండకపోతే కొన్ని సమస్యలు వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మరి జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటో చూద్దామా..
1.తప్పుగా మాట్లాడడం:
కోపంలో కొంతమంది మాట జారుతారు. నిజానికి ఇలా చేయడం వల్ల మీ మనసులో భారం తాత్కాలికంగా దూరమవవచ్చు. ఆ తర్వాత మీరే ఎక్కువగా బాధపడతారు. కాబట్టి అలాంటి తప్పులు చేయవద్దు.
Advertisement
also read:బలగం బ్యూటీ చిన్నప్పుడు కూడా చాలా సినిమాల్లో నటించిందనే విషయం మీకు తెలుసా ?
2.పిల్లలు ఉన్నట్టయితే:
కొంతమంది పెళ్లి తర్వాత బ్రేకప్ చెప్పుకుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు. చాలామంది ఇలాంటి తప్పు చేయడం వల్లే పిల్లలు బలవుతున్నారు. ఇలాంటివారు కాస్త ఆలోచించాలి.
3. ఆల్కహాల్ కు దూరంగా:
మీరు బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ అడిక్ట్ అవుతారు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనికి అలవాటు పడితే ఆరోగ్యం పైన ఎఫెక్ట్ పడుతుంది.
4.వేధింపులు మానుకోవాలి
బ్రేకప్ తర్వాత కొంతమంది వారి మాజీలపై కోపం పెంచుకుంటారు. వారిపై పగ ఏ విధంగా అయినా తీర్చుకోవాలి. ఒక్కోసారి వేధింపులకు గురి చేస్తారు. అలా వారిని మానసిక వేదన గురి చేయొద్దు. దీనివల్ల మీకే ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.
also read:మనోబాల ఆ చివరి కోరిక తీరకుండానే మరణించారా..?