Home » టీ, కాఫీలు తాగితే ఇన్ని న‌ష్టాలు క‌లుగుతాయా..?

టీ, కాఫీలు తాగితే ఇన్ని న‌ష్టాలు క‌లుగుతాయా..?

by Anji
Ad

మ‌న భార‌తీయుల‌కు ఉద‌యం నిద్ర లేవ‌గానే టీ, కాపీ తాగ‌డం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కొంద‌రూ ప్ర‌తి రోజు ఉద‌య‌, సాయ‌త్రం రెండు స‌మ‌యాల్లో టీ, కాఫీలు తాగుతుంటారు. ఆరోజు టీ, కాఫీ తాగకుంటే వారికి ఆ రోజుంతా ఏదోలా ఉంటుంది అంటుంటారు చాలామంది. ముఖ్యంగా భార‌తీయుల‌కు కాపీ తాగ‌డం అలా అల‌వాటు అయింది. చిన్న పిల్ల‌ల నుంచి పండు ముస‌లి వ‌ర‌కు అంద‌రూ టీ, కాపీల‌లో ఏదో ఒక‌టి ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక కొంత మంది అయితే రోజుకు ప‌రిమితికి మించే కాఫీని తాగుతుంటారు. ఇలా ప‌రిమితికి మించి తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. కాఫీ ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అన‌వ‌స‌ర‌పు కొవ్వుపై కొంత‌వ‌ర‌కు ప్ర‌భావం చూపిస్తుంది. కాఫీ, టీ ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయో తెలుసుకుందాం.


ముఖ్యంగా కొంద‌రు ర‌న్న‌ర్లు ప‌రుగు పందానికి ముందు ఎక్కువ‌గా కాఫీని తాగుతుంటారు. అయితే ఇలా ఎక్కువ‌గా కాఫీ తాగ‌డం వ‌ల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీంతో గుండె స్పంద‌న‌లో ల‌య‌లో తేడాలు వ‌స్తుంటాయి. గుండె చాలా ఎక్కువ‌గా ఉత్తేజం చెంద‌డం వ‌ల్ల మెద‌డు కూడా త్వ‌ర‌గా అలిసిపోతుంటుంది. కాఫీని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో చాలా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం పొంచి ఉంది. కొవ్వు త‌గ్గించుకోవ‌డానికి కాఫీని అస్స‌లు తాగ‌కూడ‌దు. ఇలా తాగ‌డంతో అన‌వ‌స‌ర‌పు కొవ్వుపై ప్ర‌భావం చూపిస్తుంది. మీరు కాఫీ తాగ‌కుండా ఉండలేక‌పోతే టీని తాగ‌డం మంచిది. కాఫీ క‌న్నా టీని తాగ‌డం మంచిద‌నే చెప్ప‌వ‌చ్చు.

Advertisement

Advertisement

టీలో థ‌యానిక్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వ‌ల్ల టీ తాగితే మన శ‌రీరానికి కాస్త రిలాక్సేష‌న్ వ‌స్తుంది. అలాగ‌ని టీలో ఎక్కువ చ‌క్క‌ర‌, పాలు పోయ‌కూడ‌దు. పంచ‌దార‌, పాల శాతాన్ని త‌గ్గిస్తే పాల శాతాన్ని త‌గ్గిస్తే చ‌క్క‌ని ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. కొంద‌రూ టీ కంటే ఎక్కువ‌గా కాఫీని ఇష్ట‌ప‌డుతుంటారు. అలాంటి వారు రోజుకి రెండు లేదా మూడు చిన్న క‌ప్పుల కాఫీని తాగ‌డం మంచిది. లేదంటే ప‌రిమితికి మించి తీసుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌లు సంభ‌వించ‌వ‌చ్చు. టీని అధికంగా తీసుకుంటే ఎక్కువ బ‌రువు పెరిగే ప్ర‌మాదం పొంచి ఉంది. అదేవిధంగా ఎసిడిటీ స‌మ‌స్య కూడా వ‌స్తుంద‌ట‌. టీ, కాఫీలే కాకుండా ఏదైనా స‌రే ప‌రిమితికి మించి తింటే ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. అందుకే మ‌నం టీ, కాఫీల‌ను త‌క్కువ‌గా తాగ‌డం బెట‌ర్. ఎక్కువ‌గా తాగితే మ‌నమే అనారోగ్యం పాల‌వుతాం.

Also Read :

మీరు అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డుతున్నారా..? అయితే మీ కొవ్వును ఇలా క‌రిగించుకోండి..!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోకి ఎర్ర చీమలు చేరితే అది దేనికి దారి తీస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading