Home » హరికృష్ణ గారు ఆ రెండుళ్లు ఎన్టీఆర్ తో ఎందుకు దూరంగా ఉన్నారు ?

హరికృష్ణ గారు ఆ రెండుళ్లు ఎన్టీఆర్ తో ఎందుకు దూరంగా ఉన్నారు ?

by Sravanthi
Ad

అలనాడు సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు కూడా చేయలేని పాత్రలు చేసి ఆల్ రౌండర్ నటుడిగా దేశవ్యాప్తంగా అన్న ఎన్టీఆర్ ఎంతో పేరు సంపాదించుకున్నారు.. రాముడు, కృష్ణుడు, ఏ పాత్ర అయినా దానికి న్యాయం చేయగల సత్తా ఆయనకు ఉండేది.. ఆ తరం నటుల్లో మేటి నటుడు ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలతో ఎంతగా పేరు సంపాదించారో, రాజకీయాల్లో కూడా అంతగానే పేరు తెచ్చుకున్నారు.. ఇన్ని ఉన్నా ఎన్టీఆర్ కు మాత్రం అణిగిమణిగి ఉండే అలవాటు ఉండేదట. ఆ అలవాటే ఆయనను అంతటి గొప్పవారిని చేసిందని అంటున్నారు ఆయన సన్నిహితులు.. ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న తనకు నచ్చిన వారితో చర్చించి అది ఓకే అనిపిస్తేనే ఆ పని చేస్తాడట. ఒకవేళ వద్దు అనిపిస్తే మాత్రం ఇక దాని గురించి మర్చిపోవలసిందే.. అలాంటి ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు.

Advertisement

also read:ర‌ష్మిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు రాక‌పోవ‌డం వెనుక‌ ఇంత క‌థ ఉందా ?

Advertisement

పేద ప్రజలకు దేవుడయ్యారు.. అయితే ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీలో ఆయన కుమారులు బాలకృష్ణ మరియు హరికృష్ణ తెలుగు తెరపై అరంగేట్రం చేశారు. ఇందులో బాలకృష్ణ స్టార్ హీరో గా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందగా, హరికృష్ణ మాత్రం తక్కువ సినిమాలతోనే విజయవంతమై ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన చేసిన సినిమాల్లో టైగర్ హరిశ్చంద్రప్రసాద్, సీతయ్య సినిమాలు ఇప్పటికీ మనం మర్చిపోలేం. హరికృష్ణ అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టమట. ఎల్లప్పుడూ నాన్న వెనకాలే ఉంటూ ప్రతి విషయాన్ని చెబుతూ అండదండగా ఉండేవారట. అలాగే ఎన్టీఆర్ కూడా కొడుకు హరికృష్ణ ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారట.. అలాంటి హరికృష్ణ రెండు సంవత్సరాల పాటు ఎన్టీఆర్ తో మాట్లాడలేదు.. దీనికి కారణం ఆ సినిమా థియేటర్..

అయితే హరికృష్ణ తనకోసం ఒక సినిమా హాలు నిర్మించాలని తండ్రిని కోరారట.. దీంతో ఎన్టీఆర్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన అక్కినేని నాగేశ్వరరావుకు చెప్పి సలహా అడిగారట.. దీంతో నాగేశ్వరరావు హాల్ నిర్మిస్తే పెద్దగా లాభం ఉండదు.. స్టూడియో నిర్మిస్తే వ్యాపారం బాగా జరుగుతుందని సలహా ఇచ్చారట. దీంతో ఎన్టీఆర్ హాల్ నిర్మించకూడదని నిర్ణయం తీసుకున్నారట.. ఈ విషయాన్ని హరికృష్ణకు చెప్పడంతో తన కోసం కనీసం హాల్ నిర్మించలేదని రెండేళ్లపాటు తండ్రితో మాట్లాడకుండా ఉన్నారట.. ఆ తర్వాత తన కోపం తగ్గి నాన్నగారు చెప్పిందే కరెక్ట్ అని భావించి మళ్లీ తండ్రితో మాట్లాడరట హరికృష్ణ.

also read:

Visitors Are Also Reading