Home » సాంగ్స్ హిట్… సినిమా ఫట్… ఆ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు సినిమాల పరిస్థితి..!

సాంగ్స్ హిట్… సినిమా ఫట్… ఆ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు సినిమాల పరిస్థితి..!

by AJAY
Ad

కొన్ని సినిమాల విడుదలకు ముందు ఆ సినిమాలోని పాటలు పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయినప్పటికీ సినిమా విడుదల అయిన తర్వాత సినిమా బాగున్నట్లు అయితే వాటి ద్వారా పాటలకు మంచి గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది. కానీ కొన్ని సినిమాలకు మాత్రం సినిమా విడుదలకు ముందే మూవీ బృందం ఆ సినిమా నుండి విడుదల చేసిన పాటలు అద్భుతంగా ప్రేక్షకులను అలరించడంతో ఆ మూవీ పాటల ద్వారానే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోతాయి.

Advertisement

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజేయాలను అందుకున్నవి అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్లలో హరిజ్ జయరాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లో కొన్ని తెలుగు సినిమాలకు కూడా సంగీతాన్ని అందించాడు. ఈయన సంగీతం అందించిన అనేక తెలుగు సినిమా ఆల్బమ్ లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఈయన సంగీతం అందించిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాలను సాధించలేదు. ఈయన సంగీత సారథ్యంలో రూపొంది సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి… సినిమాలు ఫ్లాప్ గా మిగిలినవి ఏవో తెలుసుకుందాం.

Advertisement

వాసు : విక్టరీ వెంకటేష్ హీరోగా భూమికా చావ్లా హీరోయిన్గా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా యొక్క పాటలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది.

సైనికుడు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా… గుణశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

మున్నా : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాటలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా… ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

ఆరెంజ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ క్రేజ్ లభించింది. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది.

Visitors Are Also Reading