Home » హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కోసం కోట్ల రూపాయ‌ల సెట్..!

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు కోసం కోట్ల రూపాయ‌ల సెట్..!

by AJAY
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా భీమ్లా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ను ఓటిటిలో కూడా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వం లో హరి హర వీరమల్లు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రం గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది.

Advertisement

Advertisement

కాగా ఈ సినిమా షూటింగ్ కు కొద్ది రోజులు బ్రేక్ రాగా ఇప్పుడు తిరిగి ప్రారంభించే పనిలో ఉన్నారు. అంతే కాకుండా ఈ సినిమా 17 వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమా కోసం భారీ సెట్ లను వేశారు. అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి పర్యవేక్షణలో ఈ సెట్ లను వేస్తున్నారు. ప్రాచీన భారత దేశాన్ని కండ్ల ముందు చుపించేలా ఈ సెట్ లు ఉండబోతున్నాయి. అంతే కాకుండా హైదరబాద్ శివర్ల లో వేస్తున్న ఈ సెట్ ల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading