Happy Sankranti Wishes, Quotes, Images, Greetings in Telugu 2023: సాధారణంగా పండుగలు అంటేనే పల్లెటూర్లలో ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు జరుపుకుంటారు తెలుగు ప్రజలు. ఈ పండుగ ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలను తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి పండుగను మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. అందుకే సంక్రాంతి పండుగ తేదీలలో మార్పు ఉండదు అని గమనించాలి. సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు దక్షిణయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు. ఆ సమయంలో మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి అని పిలుస్తుంటారు. సంక్రాంతి పండుగను దక్షిణభారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ పండుగ 3 రోజుల పాటు అనగా బోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో పిలుస్తారు.
Advertisement
భగీరథుడు గంగను భూలోకానికి తీసుకొచ్చి సాగరులకు శాపవిమోచనం చేయించింది ఈ రోజునే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మకర సంక్రాంతి అంటే పాత పోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజని అర్థం. ప్రధానంగా సంక్రాంతి పండుగకి పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికొస్తుంది. పొలాలలో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కళ్లాపి చల్లుతారు. ఆ తరువాత ముగ్గులు వేసి అందులో రంగులు నింపుతారు. వాటి మధ్యలో ఆవు పేడతో తయారు చేసినటువంటి గొబ్బెమ్మలను పెడతారు. సంక్రాంతి పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి సూర్యభగవానుడిని పూజించాలి. అదేవిధంగా ఇంట్లో పెద్దవారి ఆశీస్సులు తీసుకోవాలి. సంక్రాంతి పండుగ రోజు మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ.
భోగి పండుగ శుభాకాంక్షలు 2023
భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుంచి ఉధ్బవించింది. ఆ పండుగ రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చివేయడమే భోగి. ఇలా చేయడం ద్వారా వాళ్ల దురదృష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా భోగిని భోగభాగ్యాల పండుగ అని పిలుస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నెల రోజుల ముందు నుంచి చేసిన గొబ్బెమ్మలను పీడకలగా చేసి భోగి మంటల్లో వేస్తారు.
రంగు రంగుల రంగవల్లులు వేయడం, పాలు పొంగించడం వంటివి చేస్తారు. సాయంత్రం సమయంలో బొమ్మల కొలువులు పెడతారు. చిన్న పిల్లలకు రేగుపండ్లు, పూలను తలపై పోస్తారు. ఇలా చేయడాన్ని భోగిపండ్లు అంటారు. రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో తమను ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ ధాన్యం పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుడిని, విష్ణువుని పూజిస్తారు.
Advertisement
మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 2023
క్రాంతి అనే పదానికి సంస్కృతంతో ముందుకు జరగడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదలడం వల్లనే మకర సంక్రాంతి అని పిలుస్తుంటారు. అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తరువాత అయ్యప్పను మకర జ్యోతిని కూడా ఈ రోజే దర్శించుకోవడం విశేషం. సంక్రాంతి పండుగ రోజు గాలి పటాలు ఎగురవేయడం, Happy Sankranti wishes in telugu 2023 పందాలు కాయడం చేస్తారు. ఆడవారు ముగ్గులు వేయడం, ముగ్గుల పోటీలు జరుపుకోవడం చేస్తారు. సంక్రాంతి పండుగ రోజే ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు. ముఖ్యంగా స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న వంటివి ఇతరులకు ఇవ్వడం వల్ల వారికి సకల సంపదలు కలుగుతాయని నమ్మకం.
కనుమ పండుగ శుభాకాంక్షలు 2023
సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ పండుగ అని పిలుస్తారు. ఈ రోజుతో సంక్రాంతి ఉత్సవాలు ముగుస్తాయి. ఇక ఈ రోజున పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయడం ద్వారా ఇంట్లో సిరి, సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. కోడిపందాలు, ఎద్దుల పందాలు, సంక్రాంతి విషెస్ కనుమ పండుగ రోజు ఎక్కువగా నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగను సాగనంపడానికి ఈ రోజు రథం ముగ్గులు వేస్తారు. కనుమ పండుగతో సంక్రాంతి పండుగ ముగుస్తుంది.
Happy Sankranti wishes in telugu 2023 సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 2023.. విషెస్..
- సంబురాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలని.. మీకు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
- సంక్రాంతి పండుగ అంటేనే సందడి. ఈ విశిష్ట పండుగ మీకు సరికొత్త ఆనందాలివ్వాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
- మన తెలుగు వారి పండుగ సంక్రాంతి మీకు ఎన్నో ఆనంద అనుభూతులను మిగల్చాలని మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
- పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్టు.. ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో సరికొత్త ఆనందాలు తీసుకురావాలని కోరుతూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
- ఇంటికి వచ్చే పాడిపంటలు కమ్మనైన పిండి వంటలు, చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.
Also Read: Happy New Year Wishes, Images, Quotes, Greetings, Status in Telugu 2023