Home » Happy Diwali (Deepavali) Wishes, quotes, Greetings, Images in Telugu, దీపావళి శుభాకాంక్షలు 2022

Happy Diwali (Deepavali) Wishes, quotes, Greetings, Images in Telugu, దీపావళి శుభాకాంక్షలు 2022

by Anji
Ad


హ్యాపీ దీపావళి 2022 శుభాకాంక్షలు, చిత్రాలు, కోట్స్: హిందువులు జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది ఓ నమ్మకం. దీపావళి పండుగ ఎందుకు చేసుకుంటారు.. దాని వెనుక ఉన్న చరిత్ర ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

నరకాసురుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ద్వాపర యుగంలో నరకాసురుడు చెలరేగి జనాలను పీడిస్తూ దేవా, మర్త్య లోకాల్లో సంక్షోభాన్ని కలిగిస్తాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్య సమయంలో జన్మిస్తాడు నరకుడు. అసుర చేసి లక్షణాలతో పెరిగి ఘోర తపస్సు వారాలని పొందుతాడు. వాటిలో తన అంతం. ఏ తల్లి తన కొడుకుని విధించాలని భావించిన నరకుడు.. తన తల్లి చేతిలో తప్ప.. తనకు సంభవించకూడని వరం పొందుతాడు. ఇక నరకాసురుడి ఆగడాలు రోజుకి ఎక్కువ అయ్యాయి.

వర గర్వంతో అతను చేసే దుష్ట పనులు దేవతలకు సైతం కోపం తెప్పిస్తుంది. అతని ఆగడాలను అరికట్టడానికి శ్రీకృష్ణుడు సత్యబామతో కలిసి వెళ్తాడు. వారి మధ్య జరిగిన యుద్ధంలో భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో నరకాసురుడు మరణిస్తాడు. కొడుకు చనిపోయినా అతని పేరు చరిత్రలో నిలిచిపోవాలని సత్యభామ ప్రార్ధించగా.. ఆరోజుని నరక చతుర్దశి గా జరుపుకుంటారు అని వరం ఇస్తాడు శ్రీకృషుడు. ఇక ఆ మరుసటి రోజే సంబురాలు జరుపుకుంటారు. ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిని పారదోలుతూ.. ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణా సంచా కాల్చి వేడుక జరుపుకుంటారు. ఆ వేడుక  నే దీపావళి గా ప్రసిద్ధి చెందుతుంది.

ప్రతి ఏడాది ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది అమావాస్య రోజు సూర్య గ్రహణం ఉండటంతో పండితులు సోమవారం లేదా బుధవారం జరుపుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు కూడా సోమవారం సెలవు ప్రకటించాయి. దీపావళి పండుగను ఎక్కువగా రాత్రి వేళలో జరుపుకుంటారు. పూర్వకాలం గ్రామాల్లో సాయంకాలంలో గోగు కర్రలకి గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి.. గుమ్మల్లో నెల మీద కొడుతూ.. దిబ్బి దిబ్బి దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుటుక్కు దెబ్బ అని పాట పాడి.. ఆ గోగు కర్రలని ఎవరు తొక్కని చోట వేసి వెనక్కి తిరుగకుండా ఇంటికి వస్తారు. ఆ తరువాత కాళ్లు  కడుక్కుని ఇంట్లోకి వెళ్లి మిఠాయి తినేవారు. కానీ ఇప్పుడు వాటిని చాలా తక్కువ  మంది పాటిస్తున్నారు. 

Advertisement

ముఖ్యంగా దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడడం చాలా మంచిది. లక్ష్మి దేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. దీపావళి పండుగ రోజు లక్ష్మి పూజ చేస్తే తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. దీపావళి పండుగ రోజు ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా బాణా సంచా కాల్చుతుంటారు. సంతోషంగా, ఆనందంగా దీపావళి సంబురాలు జరుపుకోవాలని, ముఖ్యంగా బాణాసంచా కాల్చే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మనం న్యూస్ తరుపున అందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు.

హ్యాపీ దీపావళి 2022 తెలుగు శుభాకాంక్షలు

  • ఈ దీపావళి మీ ఇంట సిరులపంట పండించి వెలుగులు నింపాలని కోరుకుంటూ . . మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
  • దీపావళి సందర్భంగా మహాలక్ష్మి మీ ఇంట్లో మరియు జీవితంలో ఎప్పటికీ వెలుగులు నింపాలని కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
  • మీ జీవితంలో అంధకారాన్ని తొలగించాలని మరియు కాంతులు నింపాలని ఆశిస్తూ దీపావళి పండుగ శుభాకాంక్షలు.
  • అజ్ఞాన చీకట్లను పారద్రోలి మనజీవితంలో వెలుగులు నింపే దీపావళి అందరికి శుభం చేకూర్చాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
  • ఈ దీపావళి మీ ఇంట.. కురిపించాలి సిరులు పంట.. మీరంతా ఆనందంగా ఉండాలంట.. అందుకోండి మా శుభాకాంక్షల మూట..!
  • వీధులన్నీ దీపాల జాతరలతో ముస్తాబయ్యాయి… బెట్టింగ్ షాపు కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది…ఎందుకంటే దీపావళి పండుగ వచ్చేసింది.దీపావళి శుభాకాంక్షలు..!

హ్యాపీ దీపావళి చిత్రాలు 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

దీపావళి శుభాకాంక్షలు 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

దీపావళి శుభాకాంక్షలు చిత్రాల శుభాకాంక్షలు తెలుగులో 2022

 

Visitors Are Also Reading