Home » హాలీవుడ్ పాట‌కు భాంగ్రా స్టెప్పులు.. పెళ్లి కూతురు అద‌ర‌హో..!

హాలీవుడ్ పాట‌కు భాంగ్రా స్టెప్పులు.. పెళ్లి కూతురు అద‌ర‌హో..!

by Anji
Ad

సోష‌ల్ మీడియాలో ప్ర‌తిరోజూ అనేక వీడియోలు వైర‌ల‌వుతుంటాయి. వాటిలో పెళ్లిళ్ల‌కు సంబంధించిన వీడియోలు భ‌లే ఫ‌న్నిగా ఉంటాయి. కొన్ని పెళ్లిళ్ల‌లో డ్యాన్స్‌ల‌తో అద‌ర‌గొడుతుంటారు వ‌దువు, వ‌రుడు ఇద్ద‌రితో పాటు బందువులు కూడా పాల్గొంటారు. అలాంటి వీడియోలు ఇటీవ‌ల బాగా ఇష్ట‌ప‌డుతున్నారు నెటిజ‌న్లు. అలాంటి వీడియో ఒక‌టి నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

Viral Video : హాలీవుడ్‌ పాటకు భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టిన పెళ్లి కూతురు..!

Advertisement

Advertisement

వైర‌ల‌వుతున్న ఈ వీడియోలో ఓ పెళ్లి కూతురు హాలీవుడ్ పాట పేష్ ఆఫ్ యూ కు భాంగ్రా స్ట‌యిల్‌లో స్టెప్పులేసి అద‌ర‌గొట్టింది. ఈ డ్యాన్స్‌లో నూత‌న వ‌ధువుతో పాటు మ‌రికొంద‌రూ కాలు క‌దిపారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆ వీడియో కింద కామెంట్ రాసారు. భాంగ్రా ఎంఫైర్ నుంచి వ‌ధువు వ‌స్తుంద‌ని పోస్ట్ చేస్తూ.. ఆ వీడియో కింద కామెంట్ కూడా రాసారు. భాంగ్రా ఎంఫైర్ నుంచి వ‌ధువు వ‌స్తుంద‌ని తెలియ‌గానే.. ఆ ఢ్యాన్స్‌ను ఇష్ట‌ప‌డే వారికి ట్యాగ్ చేయండి అని కామెంట్ రాసారు.

భాంగ్రా ఎంఫైర్ అనేది ఒక డ్యాన్స్ టీమ్‌. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న బే ఏరియాలో దీన్ని 2006లో స్థాపించారు. ఆ బృందంలోని ఒక‌రే రాణి అర్ప‌వ‌ల్లి అనే ఈ వ‌ధువు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోను వేల‌మంది వీక్షించ‌డ‌మే కాదు. విప‌రీతంగా లైక్ చేస్తూ.. షేర్ కూడా చేస్తున్నారు.

Visitors Are Also Reading