Home » HAPPY BIRTHDAY DHONI: ధోనికి జెర్సీ నెంబర్ 7 ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?

HAPPY BIRTHDAY DHONI: ధోనికి జెర్సీ నెంబర్ 7 ఎందుకు ఉంటుందో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

టీమ్ ఇండియా కెప్టెన్ గా చేసి క్రికెట్ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశాడు ఎంఎస్ ధోని. మైదానంలో అడుగుపెడితే ధోని నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంతో కూల్ గా వ్యవహరించి ఎన్నో సందర్భాల్లో తన టీమ్ ను అగ్రస్థానంలో నిలపాడని చెప్పవచ్చు. కెప్టెన్ గా బ్యాటర్ గా,కీపర్ గా ఏ బాధ్యత తీసుకున్నా కష్టించి పనిచేసే వ్యక్తిత్వం ధోని కి మాత్రమే సొంతం. మరి అలాంటి ధోని తన జెర్సీ పై నెంబర్ 7 ఎందుకు ఉంటుందో ఓసారి చూడండి..

Advertisement

క్రికెట్ మాత్రమే కాకుండా ప్రతి క్రీడలో ఆటగాళ్లకు ప్రత్యేకమైనటువంటి జెర్సీ లు ఉంటాయి. కొంతమంది ఆ జెర్సీలను వారి యొక్క అదృష్టంగానే భావిస్తారు. ప్రతి ఆటలోనూ ఆ జెర్సీ నే వాడుతూ ఉంటారు. ఆ జెర్సీ పై ఉండే ఆ నెంబర్ వారి అదృష్టంగా భావిస్తారు. ముఖ్యంగా ఫుట్ బాల్ స్టార్ ఆటగాళ్లు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రోనాల్డో, క్రికెట్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇందులో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని తన కెరీర్ మొత్తం ఒకటే జెర్సీ నెంబర్ తో బరిలోకి దిగాడు.

Advertisement

అది ఏ మ్యాచ్ అయినా సరే ధోని నెంబర్ 7 జెర్సీతో ఆడటం చూస్తూ ఉన్నాం. మరి నెంబర్ 7 జెర్సీ ఎందుకు వాడతారో చూడండి. మహేంద్రసింగ్ ధోని పుట్టిన రోజు తేదీ 7 కావడం వల్లనే జెర్సీ నెంబర్ 7 తీసుకున్నాడని ధోని కొన్ని సందర్భాల్లో తెలియజేశారు. కానీ కొంతమంది అది ఆయన అదృష్టసంఖ్య అని అంటూ ఉంటారు. అవన్నీ నిజం కాదని 7 నెలలో 7వ తేదీన పుట్టాను కనుక ఆ నెంబర్ నేను ఎంచుకోవడం జరిగిందని ధోని కొన్ని ఇంటర్వ్యూలో తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading