Telugu News » Blog » హన్సిక మామూలుది కాదు బాబోయ్.. హనీమూన్ ప్లాన్ అదిరిపోలా..!!

హన్సిక మామూలుది కాదు బాబోయ్.. హనీమూన్ ప్లాన్ అదిరిపోలా..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా స్టార్ హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటి వారు అవుతున్నారు. అంతేకాకుండా టకటకా పిల్లల్ని కూడా కంటూ తల్లులుగా మారుతున్నారు. అదే బాటలో స్టార్ హీరోయిన్ హన్సిక కూడా వెళ్ళింది.. తను ఎంతో కాలం నుంచి ప్రేమించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంది..అయితే ఈ హీరోయిన్ పెళ్లి,హనీమూన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైంది హన్సిక. ఈ సినిమాలో ఆమె నటనను అభిమానులు ఈనాటికి కూడా మర్చిపోలేరు.

Advertisement

also read:ఈ రాశుల వారికి జీవితాంతం డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి..!!

అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో హన్సిక క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత రూటు మార్చిన హన్సిక కోలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఈ తరుణంలోనే ఆమె పెళ్లిపై కొన్ని వార్తలు వచ్చాయి. హన్సిక ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లికూడా చేసుకోబోతుందని ప్రచారం సాగింది. ఇంతలోనే ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.. ముంబైకి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ తో ప్రేమలో ఉన్నానని, అతను ప్రపోజ్ చేసిన ఫోటోలు షేర్ చేస్తూ ఐ లవ్ యు టూ అంటూ అఫీషియల్ గా తన ప్రేమను బయట పెట్టింది.

Advertisement

పెళ్లి కూడా ఓకే చేసుకొని జైపూర్ లోని చారిత్రక కట్టడం ముంటోడా ప్యాలెస్ లో ఆ వ్యాపారవేత్తతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏ విషయంలోనైనా డిఫరెంట్ గా ఆలోచించే హన్సిక తన హనీమూన్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హన్సిక మూడు వారాలపాటు ఫారిన్ కంట్రీస్ లో హనీమూన్ కి వెళ్లాలని ప్లాన్ చేసిందట. ముందుగా మాల్దీవ్స్ కి వెళ్లాలని అనుకుందట కానీ, అది నచ్చకపోవడంతో ఇటలీ, స్విట్జర్లాండ్ లో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తెలిసిన ఆమె ఫ్యాన్స్ హన్సిక నటన లోనే కాదు తన నిజ జీవితంలో కూడా చాలా డిఫరెంట్ అంటూ కామెంట్లు పెడుతూ ఎంజాయ్ హన్సిక అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

also read: