Telugu News » Blog » పెళ్లి పీటలు ఎక్కబోతున్న హన్సిక….వరుడు ఎవరంటే….?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న హన్సిక….వరుడు ఎవరంటే….?

by AJAY
Published: Last Updated on
Ads

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా కెరీర్ ను షురూ చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంది. తెలుగులో కందిరీగ, పవర్ తో పాటు అనేక చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తమిళ్ లోను హన్సిక స్టార్ హీరోయిన్ గా రాణించింది.

ఇదిలా ఉండగా 2015 తర్వాత హన్సిక పెద్దగా సినిమాలు చేయలేదు. దాదాపుగా హన్సిక సినిమాలకు దూరమైంది. కాగా ఇప్పుడు హన్సిక పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో హన్సిక వివాహం జరగబోతున్నట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వీరి పెళ్లికి కుటుంబాలు ఒప్పుకున్నాయట. అంతేకాకుండా అతి త్వరలో ఎంగేజ్మెంట్ కూడా జరగబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై హన్సిక ఇప్పటివరకు స్పందించలేదు. గత కొద్ది రోజులుగా పెళ్లి వార్తలు వస్తున్నా హన్సిక స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమేనని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలి అంతే హన్సిక ఓపెన్ అవ్వాల్సిందే.


You may also like