ప్రస్తుత కరోనా కాలంలో శానిటైజర్ గురించి తెలియని వారుండరు. చిన్న పిల్లలు సైతం అడిగి మరీ శానిటైజర్‌ను తమ చేతులకు అప్లై చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కరోనా కారణంగా శానిటైజర్ వినియోగం ఆరేంజ్‌లో పెరిగింది మరి. కరోనా రాకుండా ఉండాలంటే చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని మూతి, ముక్కుకు మాస్క్ పెట్టుకోవాలని, శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని నిత్యం వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తూనే ఉన్నారు.
కరోనా కారణంగా చాలా మంది శానిటైజర్ తరుచుగా రాసుకోవడం వల్ల చేతులు దురుసుగా, కటువుగా మారిపోయాయి. దాంతో చేతులను మృదువుగా మార్చుకునేందుకు చాలా మంది ఆపసోపాలు పడుతున్నారు. అయితే శానిటైజర్ కారణంగా కరువుగా మారిన చేతులు మృదువుగా మారేందుకు పలు చిట్కాలను సూచిస్తున్నారు నిపుణులు. ఆ చిట్కాల ఆధారంగా చేతులను స్మూత్‌గా మార్చుకోవచ్చట. మరీ ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్
Advertisement
Advertisement
చేతులను మృదువుగా మార్చడంలో ఓట్స్ అద్భుతంగా పని చేస్తాయట. ఓట్స్ పౌడర్‌లో కొబ్బరి నూనె కలిపి చేతులకు అప్లై చేయాలి. అరగంట పాటు అదేవిధంగా ఉంచి.. ఆ తరువాత మంచి నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజు చేస్తే క్రమంగా చేతులు స్మూత్‌గా మారుతాయి.
బంగాళ దుంప
బంగాళదుంప కూడా మీ చేతులను స్మూత్‌గా చేస్తుంది. ముందుగా బంగాళ దుంపలను ఉడికించి మెత్తగా పేస్ట్‌గా చేసుకోవాలి. ఆ పేస్ట్‌లో కొద్దిగా బాదం ఆయిల్, గ్లిజరిన్ కలిపి చేతులకు అప్లై చేయాలి. బాగా డ్రై అయిన తరువాత మంచి నీళ్లతో చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తే చేతులు సుతిమెత్తగా తయారవుతాయి.
కోడిగుడ్డు
బౌల్లో ఎగ్‌వైట్ ఆలివ్ నూనె, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి చేతులకు పట్టించాలి. అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత మంచినీటితో చేతులను క్లీన్ చేసుకోవాలి.