టాలీవుడ్ నటి హంసనందిని క్యాన్సర్ భారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హంసనందిని ఇటీవలే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన తల్లి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తో మరణించారని వంశపారంపర్యంగా తనకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని హంసనందిని పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం తాను కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నానని త్వరలోనే క్యాన్సర్ ను జయిస్తానని హంసనందిని దీమా వ్యక్తం చేసింది.
hamsanandhini
కాగా తాజాగా తన ఆరోగ్యం పై హంసనందిని తాజాగా మరో అప్డేట్ ఇచ్చింది. 16 సైకిల్స్ కీమో థెరపీ చేశారని హంసనందిని పేర్కొన్నారు. ఇప్పుడు తాను అధికారికంగా కోలుకున్నానని కూడా హంస నందిని స్పష్టం చేసింది. కానీ చికిత్స ఇంకా పూర్తవలేదని తాను పూర్తిగా కోలుకోలేదని కూడా హంస నందిని పేర్కొన్నారు. తదుపరి పోరాటానికి సన్నద్దం కావాల్సిన సమయం ఇది అంటూ హంసనందిని పేర్కొంది. సర్జరీలకు సమయం ఆసన్నం అయంది అంటూ ఓ ఫోటోను హంస నందిని షేర్ చేసింది.
Advertisement
Advertisement
కాగా ప్రస్తుతం మీరు త్వరగా కోలుకోవాలి అంటూ నెటిజన్లు అభిమానులు హంస నందిని ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా హంసనందిని ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన అనుమానాస్పదం అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అంతే కాకుండా ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో పాటూ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్ పాటలకు స్టెప్పులు వేసి కుర్రాళ్లకు మత్తెక్కించింది.