Telugu News » Blog » మీ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తున్నారా..ఇది ఫాలో అవ్వకుంటే ప్రమాదమేనట..!!

మీ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తున్నారా..ఇది ఫాలో అవ్వకుంటే ప్రమాదమేనట..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పని వెనుక ఏదో ఒక మర్మం ఉండే ఉంటుంది. ఇందులో ముఖ్యంగా చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకల వెనుక కూడా ఓ గొప్ప విషయం దాగి ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. గర్భంలో ఉన్న శిశువు బయటకు వచ్చే టైం లో ముందుగా తల ద్వారా బయటకు వస్తారు. ఆ టైంలో శిశువుకు ఉన్న తల వెంట్రుకలలో పూర్వజన్మ కు సంబంధించినటువంటి పాపాలు అనేవి అంటిపెట్టుకొని ఉంటాయట. అందుకోసమే చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు అనేవి తీస్తూ ఉంటారు.

Advertisement

ALSO READ:అనారోగ్యంతో పాటూ ఆ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న స‌మంత‌..? ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందంటే..?

ఆ పాపాలు తొలిగేందు కోసమే భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తారని కోరుకుంటూ ఉంటాం. ఒకరకంగా చెప్పుకుంటే మనసును భగవంతునికి ఇచ్చే బదులు కేశాలను ఇస్తాం. ఈ తలవెంట్రుకల పై మహాభారతంలో ఒక పెద్ద కథ ఉంది. సైంధవుని సంహరించడం కోసం భీముడు సిద్ధమైన సందర్భంలో ధర్మరాజు అతనన్ని వారిస్తాడు. కౌరవుల సోదరి అయిన దుస్సల భర్త సైంధవుడిని వధించడం ధర్మం కాదని, అందుకోసమే తలవెంట్రుకలు అయితే తల తీసినంత పని అవుతుందని వివరిస్తాడు.

Advertisement

అలాగే శిశువు పుట్టిన వెంటనే సంవత్సరంలోపు తల వెంట్రుకలు తీయడం వెనుక గత జన్మ పాపాలను ప్రక్షాళన చేయడమే కాకుండా, మంచి జ్ఞాన సముపార్జనకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో ముహూర్తం కూడా చూసుకుంటారు. అందుకే శిశువు పుట్టిన సంవత్సరం లోపు లేదంటే మూడవ సంవత్సరం, లేదా 5 వ సంవత్సరంలో తీయాల్సి ఉంటుంది. ఈ వెంట్రుకల తీసేటప్పుడు శిశువు జాతకరీత్యా శుభ ముహూర్తం, తారాబలం, నవగ్రహ సంపత్తి మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ కార్యాన్ని నిర్వహిస్తారు.

Advertisement

ALSO READ:

You may also like