Telugu News » Blog » TSPSC కంప్యూటర్ల హ్యాకింగ్… ఈ పరీక్షలు వాయిదా!

TSPSC కంప్యూటర్ల హ్యాకింగ్… ఈ పరీక్షలు వాయిదా!

by Bunty
Ads

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్యూటర్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. టిఎస్పిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించనున్న టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్స్ హ్యాక్ అయ్యాయి. పేపర్స్ హ్యాక్ వ్యవహారంపై కమిషన్ అధికారులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితులను బేగం బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ సిబ్బంది పాత్ర పై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

Advertisement

కీలకమైన హోదాల్లో ఉన్న అధికారుల వద్ద లాగిన్ వివరాలు ఉంటాయి. ఈ విషయాలు ఎలా లీక్ అయ్యాయి, ఎవరు లాగిన్ అయ్యారు, ఎందుకు అయ్యారు, ఏ సమాచారం చోరీ చేశారు అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాబట్టి ఎస్పిఎస్సి లోని కంప్యూటర్ల నుంచి అత్యంత రహస్యమైన సమాచారం లీకైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు పరీక్షలు వాయిదా వేశారు. నేడు జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష కూడా వాయిదా వేశారు.

READ ALSO : Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!

అలర్ట్: సైబర్ దాడులతో ప్రపంచానికి షాక్! - hackers exploit stolen us spy agency tool to launch global cyber-attack - Samayam Telugu

మార్చి 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష సైతం వాయిదా వేసినట్లు టిఎస్పిఎస్సి అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

READ ALSO : బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్… మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌..!