తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్నీ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో దాదాపు 11 వేలకు పైగా అధ్యాపకుల పోస్టులకు నియామక ప్రకటన జారీ చేయాలని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Advertisement
ఈ ఏడాదికి కొత్తగా మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలో మంత్రి మండలి ఆమోదించిన దాదాపు 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రోస్టర్, జోన్లు, మల్టీ జోన్ల వారిగా పోస్టులను గుర్తింపు పూర్తి చేసింది. జనవరి రెండో వారంలో ప్రకటన జారీ చేయాలని గురుకుల బోర్డు భావిస్తోంది.
Advertisement
రెసిడెన్షియల్ గురుకులాల్లో ఇప్పటికే 9,096 పోస్టులను రాష్ట్ర సర్కార్ మంజూరు చేసింది. అదనంగా మంజూరైన పోస్టులతో కలిపి ఒకేసారి భారీగా నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రకటన అనంతరం పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి కనీసం మూడు నెలల సమయం ఉండేలా షెడ్యూల్ తయారు చేయనున్నారు. గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు రెండు, ఆపైన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పోస్టులకు సన్నద్ధమై, పరీక్షలు రాసేలా షెడ్యూల్ రూపొందించనుంది.
ఇవి కూడా చదవండి : 2024 సంవత్సరం ఏపీలో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు…! వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!