Home » Gurthunda Seethakalam: ఓటీటీలో ‘గుర్తుందా శీతాకాలం’ వచ్చేసింది ..ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

Gurthunda Seethakalam: ఓటీటీలో ‘గుర్తుందా శీతాకాలం’ వచ్చేసింది ..ఎందులో స్ట్రీమింగ్ అంటే ?

by Bunty
Ad

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటిస్తూనే మరో పక్క హీరోగాను అదరగొడుతున్నాడు. తాజాగా సత్యదేవ్ నటించిన తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ హీరోయిన్ గా చేస్తోంది.

Advertisement

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా, మరో హీరోయిన్లుగా మేఘ ఆకాష్, కావ్యశక్తి చేశారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. కన్నడలో విజయవంతమైన ‘లవ్ మాక్ టెయిల్’ అను చిత్రానికి తెలుగు రీమేకే గుర్తుందా శీతాకాలం. తెలుగు నేటివిటికి తగినట్టు కొన్ని మార్పులు చేసి ఈ లవ్ స్టోరీని తెరకెక్కించారు.

Advertisement

ఇలాంటి ప్రేమకథలు ఎన్ని వచ్చినా సరే, వాటిపై ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ తగ్గదు. కాకుంటే, తెరపై చూపించే విధానంలో వైవిధ్యం ఉండాలి. కానీ గుర్తుందా శీతాకాలంలో అది మిస్ అయింది. ఇక గతేడాది 9న రిలీజ్ అయిన ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా చూడాలని అనుకునే వారు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు.

read also : సౌతాఫ్రికా వ్యక్తితో SRH కావ్య మారన్ లవ్.. వీడియో వైరల్ !

Visitors Are Also Reading