Telugu News » Blog » శాకుంతలం సినిమాలో మోహన్ బాబు పాత్ర గురించి దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర కామెంట్స్..!

శాకుంతలం సినిమాలో మోహన్ బాబు పాత్ర గురించి దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర కామెంట్స్..!

by Anji
Ads

కాళిదాస్ రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు మలయాళ నటుడు దుష్యంతుడి  పాత్రలో కనిపించనున్నారు. శకుంతల చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడం, తమిళం వంటి భాషల్లో రూపొందించిన ఈ చిత్రంలో మోహన్ బాబు,  ప్రకాష్ రాజు, అల్లు అర్జున్ కూతురు  అల్లు అర్హ కీలకపాత్రలో నటించారు.

Advertisement

Also Read :  DASARA:ఎవరీ శ్రీకాంత్ ఓదెలా..ఆయన గురించి ఎవరికీ తెలియని పచ్చి నిజాలు..!!

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు జోరుగా కసాగుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో తాను తెరకెక్కించిన ఓ సినిమాలో కీలక పాత్ర కోసం మోహన్ బాబును సంప్రదించాను కానీ మోహన్ బాబు రిజెక్ట్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల కాబోతున్న శకుంతలం చిత్రంలో దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్ బాబు తన ఛాయిస్ కాదని చెప్పారు. మహాకవి కాళిదాసు ఛాయిస్. ఎందుకంటే కాళిదాసు వర్ణన చదివిన తర్వాత దుర్వాస మహర్షి పాత్రకు నూటికి నూరు శాతం ఆయననే న్యాయం చేయగలరని పెంచింది.

Advertisement

Also Read :  మ‌యోసైటిస్ కాకుండా మరో వ్యాధితో బాధ‌ప‌డుతున్నానంటున్న స‌మంత‌..అదేంటంటే..?

గతంలో రుద్రమదేవి సినిమాలో ఓ పాత్రకు అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆరోజు ఆయనను బలవంతం చేయలేదు. కానీ శకుంతలం అనుకున్న తర్వాత ఆయనను కలిసాను. ఈసారి మీరు నో చెప్పలేని పాత్రతో వచ్చాను. ఒకవేళ మీరు చేయను అంటే ప్రత్యామ్నాయం ఎవరో మీరే చెప్పండి అని అడిగాను. దానికి ప్రాజెక్టు ఏంటి అని అడిగాడు.శకుంతలంలో దుర్వాస మహర్షి పాత్రను చెప్పాను. వెంటనే ఆయన పెద్దగా నవ్వి కోపిష్టి అని నా వద్దకు వచ్చావా అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు.. ఆయన గొప్ప మహర్షి అని బదులిచ్చాను. దానికి ఆయన ఈ పాత్ర నేనే చేస్తానంటూ అంగీకారం తెలిపారు అని చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read :  తనకు ఇష్టమైన బౌలర్లు వీరే.. బాలయ్య కామెంట్స్ వైరల్..!

You may also like