Home » స్టార్ట్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురి పెళ్లి వేడుక…. వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…?

స్టార్ట్ డైరెక్టర్ గుణశేఖర్ కూతురి పెళ్లి వేడుక…. వరుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…?

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో గుణశేఖర్ కూడా ఒకరు. సినిమాల్లో భారీ సెట్ లతో సన్నివేశాలు తీయడంలో గుణశేఖర్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో పాటు ఎన్నో సూపర్ హిట్ లను గుణ శేఖర్ తెరకెక్కించారు. చివరగా ఆయన రుద్రమదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అనుష్క రానా ప్రధాన పాత్రలో నటించారు.

Advertisement

అయితే గుణశేఖర్ సినిమాల గురించి చాలా మందికి తెలుసు.. కానీ ఆయన పర్సనల్ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. తాజాగా గుణశేఖర్ కూతురు నీలిమ పెళ్లికూతురిగా మారింది. నేడు ఫలక్ నుమా ప్యాలెస్ లో నీలిమ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీలిమ కూడా సినిమాల్లో నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Advertisement

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాకు నీలిమ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమాను సైతం నీలిమ నిర్మించారు. అయితే ఇప్పుడు నీలిమ ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

అతడు కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనా…. లేదంటే బయటివారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం నీలిమ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు రవి ప్రఖ్యా…. కాగా అతడు ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. ఇదిలా ఉంటే నీలిమ నిర్మించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading