ఈసారి ఐపీఎల్ రిటెన్షన్ లో రెండు సంచలన నిర్ణయాలు కనిపించాయి. మొదటిది గుజరాత్ టైటాన్స్ తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీమ్ కి వదిలేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఆడిన రెండు సీజన్లలో ఓసారి ఛాంపియన్ గా, మరోసారి ఫైనలిస్ట్ గా నిలబెట్టిన పాండ్యాను తన పాతజట్టు ముంబైకి జీటీ బదిలీయడం చాలా పెద్ద నిర్ణయం అని చెప్పాలి.
మరోవైపు పదిహేడున్నర కోట్లు పెట్టి కొనుక్కున్న కెమెరున్ గ్రీన్ ను ముంబై వదిలేసుకోవలసి వచ్చింది. పాండ్యాను తీసుకోవాల్సి రావడంతో ముంబై ఈ నిర్ణయం తీసుకోగా…. ఆర్సిబి, ముంబైకి మధ్య ప్రైవేట్ చర్చలు సఫలమై గ్రీన్ ను కొనుగోలు చేసింది.
Advertisement
Advertisement
ఆర్సిబి వీరిద్దరూ కాకుండా లక్నో సూపర్ జేయింట్స్ దేవదత్ పడిక్కల్ ను ట్రేడ్ చేసుకుంది. ఆవేష్ ఖాన్ ను రాజస్థాన్ రాయల్స్, మయాంక్ అగర్ ఆర్సిబి, శాబాజ్ ను సన్రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసుకుంది. ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న తర్వాత ఆయా ఆటగాళ్ల టీం జాబితా ఇదే. కాగా, ముంబైకి వచ్చిన పాండ్యను కెప్టెన్ చేయనున్నట్లు తెలుస్తోంది.