Home » Gruhalakshmi ఏప్రిల్ 28 (ఈరోజు) ఎపిసోడ్ : ప్ర‌వ‌ల్లిక రాక‌తో మారిపోయిన తుల‌సి.. చీర తీసి డ్రెస్‌..!

Gruhalakshmi ఏప్రిల్ 28 (ఈరోజు) ఎపిసోడ్ : ప్ర‌వ‌ల్లిక రాక‌తో మారిపోయిన తుల‌సి.. చీర తీసి డ్రెస్‌..!

by Anji
Ad

ఓ సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కుని వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పని చేస్తున్నాడు. ప్రేమ్‌కు పాట రాసే అవకాశం ఇచ్చిన‌ట్టే ఇచ్చిన ఆ సంగీత ద‌ర్శ‌కుడు ప్రేమ్ ముందే ఆ పాట‌ను చింపేసి చెత్త‌బుట్ట‌లో ప‌డేస్తాడు. చివ‌ర‌కు అదే పాట‌ను ఆ సంగీత ద‌ర్శ‌కుడే రాసిన‌ట్టుగా నిర్మాత‌ల వ‌ద్ద డ‌బ్బులు లాగేస్తాడు. ఈ విష‌యం తెలుసుకుని ప్రేమ్ ఆ సంగీత ద‌ర్శ‌కున్ని నిల‌దీస్తాడు. దీంతో ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ నా ద‌గ్గ‌ర ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేదు అని.. మానేయాలంటే మానేసేయ్ అని అంటాడు. ఆ మాట‌కు ప్రేమ్ మౌనం వ‌హించి శృతి చెప్పిన మాట‌లు గుర్తుకొస్తాయి. మీ ద‌గ్గ‌రే ప‌ని చేస్తాను సార్ అని చెబుతాడు ప్రేమ్‌. అప్పుడు వెంట‌నే ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఈ పాట‌ను ఎవ‌రు రాశార‌ని అడుగుతాడు. మీరే రాసారు సార్ అని చెబుతాడు ప్రేమ్‌.


తుల‌సి ఫ్యాక్ట‌రీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి ఇంటి ప‌నుల్లో ఉంటుంది. ఆ ఇంట్లో మిగిలిన ముగ్గురు అన‌సూయ‌, ప‌రందామ‌య్య‌, దివ్య తులసి గురించి ఆలోచిస్తుంటారు. ప‌రందామ‌య్య ఒక్క మాట కూడా చెప్ప‌కుండా నువ్వు తీసుకున్న నిర్ణ‌యం మాకు న‌చ్చ‌లేదు అని.. ఆ ఫ్యాక్ట‌రీని మొక్కలా పెంచావు.. చివ‌రికి ఫ‌లాలు చేతికొచ్చేస‌రికి వ‌దిలేశావు నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి క‌దా అని ప‌రందామ‌య్య అంటారు. తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యం తీసుకోలేదు మామ‌య్య‌.. ఫ్యాక్ట‌రీని నా బిడ్డ మాదిరిగానే చూసుకున్నా.. అందుకే నా బిడ్డ మాదిరిగానే అది దూరం అయింద‌ని తుల‌సి పేర్కొంటుంది. వ‌ర్క‌ర్స్ కోసం ఆలోచించావు మంచిదే కానీ.. మ‌న‌కు ఉన్న ఒక్క ఆధారం పోతే మ‌నం ఎలా బ‌తికేది అని ఆలోచించావా..? అంద‌రూ దూర‌మ‌య్యారు. నీకు తోడు ఉండేవారే లేరు క‌ద‌మ్మా.. అని ప‌రందామ‌య్య అన‌డంతో క‌ష్ట‌ప‌డ‌డం నాకు కొత్త ఏమి కాదు కదా మామ‌య్యా అని తుల‌సి అంటుంది.

Advertisement

నీ కష్టాలకు తోడు మేము నీకు భారంగా మారాము. మేము లేకపోతే నీకు ఇన్ని కష్టాలు ఉండేవి కావని పరంధామయ్య అనసూయలు అంటారు. పక్కనే ఉన్న దివ్య అవును మమ్మీ నేను కూడా భారంగా మారాను. నా చదువు ఆపేస్తాను అని అంటుంది. వారి మాటలతో తులసికి కళ్ళు తిరిగి కింద పడిపోతుండగా ప్రవల్లిక తులసిని పట్టుకుంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అనిపించి నేను వచ్చాను. కానీ నీ మాటలు విన్న తర్వాత నువ్వు చేసింది కరెక్ట్ అనిపించింది అని.. ప్రవళిక తన స్టైల్ లో ఇంట్లో వాళ్లకు క్లాసు పీకుతోంది.


తప్పో ఒప్పో తులసి నిర్ణయం తీసుకుంది. ఇవ్వకుండా ఇలా బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అంటుంది. ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చి నాకు క్లాసు పీకింది అని మీ వాళ్ళు నా వైపు విచిత్రంగా చూస్తున్నారు. నన్ను పరిచయం చేయి ప్రవళిక తులసి అడుగుతుంది. తులసి తన అత్తమామలకు ప్రవల్లిక ను పరిచయం చేస్తుంది. ఆకలి వేస్తోంది అని పెడతావా లేదా అని అడిగి మరి తులసి చేతి వంట రుచి చూస్తుంది ప్రవళిక. ఇదిలా ఉండగా శృతి కంగ్రాట్స్ మై డియర్ ప్రేముని వాటేసుకుంది. నీకేమైనా మైండ్ దొబ్బిందా..పాటను కొట్టేసిన బాధలు నేను ఉంటే సెలబ్రేషన్ అంటావ్ ఏమిటి అని ప్రేమ్ పేర్కొంటాడు.

Advertisement


ఇక శృతి.. నా ప్రేమ్ రాసిన పాట సినిమాకు సెలెక్ట్ అయింది. పాట అందరికీ నచ్చింది. నిన్నటి వరకు నీకు రాయడం రాలేదని నువ్వు బాధ పడ్డావు ఇప్పుడు నువ్వు రాసిన పాట అందరికి నచ్చిందంటే నీ ఆలోచన తప్ప అనే కదా.. పేరులో ఏముంది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అని చెప్పడంతో ప్రేమ్ అటువైపుగా ఆలోచించి శృతిని తులసితో పోల్చడం మొదలుపెడతాడు. నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తుకొస్తుంది. మనసును బాధ పెట్టే విషయంలో కూడా తాను సంతోషాన్ని వెతుక్కుంటుంది. నువ్వు అన్నట్టుగానే నా కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది ఈ ఉత్సాహంతో మరిన్ని పాటలు రాస్తాను. నా బిడ్డ అని మా యమ్మ గర్వపడే విధంగా ఎదుగుతానని ప్రేమ్ పేర్కొంటాడు.


మీ పెళ్లయి పాతికేల్లు అవుతుంది. ఎప్పుడైనా విశ్రాంతి తీసుకున్నవా తులసి అని ప్రవళిక అడిగితే.. తులసి నీళ్లలో ఇదే చేప ఎప్పుడు విశ్రాంతి తీసుకోదు. అలా జరిగి గట్టు మీదికి వస్తే దాని జీవితం ముగిసినట్లే అని వేదాంతం చెబుతోంది తులసి. ఇక లాస్య తులసిని ఎన్ని దెబ్బలు కొట్టిన అలా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అని తెగ ఫీల్ అవుతోంది. మేము లో నందు వచ్చి ఫ్యాక్టరీ చేతికి వచ్చినప్పుడు బుద్ధిగా అనుకోవచ్చు కదా నాకు సంబంధం లేదని వదులుకోవడం ఎందుకు అని అంటాడు నందు. తెలివితక్కువ పనులు చేస్తుంది. ఎవరో తనపై పగపట్టి ఫ్యాక్టరీ ని క్లోజ్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని.. దీంతో వర్కర్స్ కి ప్రమాదం అని చెప్పి ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేసింది అని నందు చెబుతాడు. ఇంత మంచి శుభవార్త లు ఇలా చెబుతావ్ ఏంటి నందు అని లాస్య అంటుంది. ఇది శుభవార్త ఎలా అవుతుంది లాస్య.. సంపాదన లేకపోతే మా అమ్మానాన్నల పరిస్థితి ఏమిటి అసలు తులసి పై ఎన్ని కుట్రలు ఎవరు చేస్తున్నారు..? చేస్తే ఏమిటి నందు మనం చేయలేని పని వాళ్లు చేస్తున్నారు కదా అని లాస్య పేర్కొంటోంది.

దాని వల్ల మనకు ఏమి ఉపయోగం అని నందు అంటే సంపాదన లేకపతే తులసి మీ అమ్మ, నాన్నలను ఎలా పోషిస్తుంది. ఈ దెబ్బకి మీ అమ్మానాన్న లో మన దగ్గరకు వస్తారు చూడని లాస్య అంటుంది. రేపటి ఎపిసోడ్ లో తులసి ని బయటకు తీసుకు వెళ్లిన ప్రవళిక నిన్ను మొత్తం మార్చేస్తానని చెబుతుంది. తొలుత ఆమె డ్రెస్సింగ్ తో పని మొదలు పెట్టింది. షాపింగ్ కి తీసుకొని వెళ్లి ఫ్యాషన్ డ్రెస్ తీసి తులసి ఇచ్చి ఇది వేసుకుని రమ్మని చెప్పింది. ఇక మిగతా కథ రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాము.

Also Read :

కేజీఎఫ్ చాప్టర్-3 పై అయ్యప్ప శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…అందుకే తాను బతికున్నా అంటూ…!

వర్షం తో వచ్చిన లాభాలు వాన తో పోగొట్టుకున్న ఎమ్ఎస్.రాజు…. ఆ నిర్ణయమే కొంపముంచింది…!

 

Visitors Are Also Reading