కష్టాల్లో ఉన్న తన తల్లికి ఆసరాగా ఉండడం కన్నా తన ఫ్యూచరే ముఖ్యమనుకున్న అభి అత్త పక్షాన చేరడానికి సిద్ధమవుతాడు. కొడుకు భవిష్యత్ గురించి ఆలోచించిన తులసి కఠిన నిర్ణయానికి వచ్చింది. అభి అత్త గాయత్రికి ఫోన్ చేసి శ్రీరామనవమి పూజకు ఆహ్వానించి ఓ ముఖ్యమైన విషయం చెబుతాను ఇంటికి రమ్మని చెబుతుంది. ఇక ఇవాళ అనగా ఏప్రిల్ 21 ఎపిసోడ్‌లో ఏమైందంటే.. శ్రీరామనవమికావడంతో నందు బయటకు వెళ్లి పూజకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొస్తాడు. రక్తి తప్ప భక్తి జోలికి వెళ్లని లాస్య మోడరన్ బట్టల్లో కనిపించి నందుకు షాకిస్తుంది. నీకు ముందే చెప్పాను కదా.. ఇవాళ శ్రీరామనవమి పూజ చేయాలని ఎందుకు రెడీ కాలేదు అని అడుగుతాడు. బద్ధకంగా ఉండి సిద్ధం కాలేదు నందు అని పేర్కొంటుంది లాస్య. సరే తొందరగా రెడి అయిరా అని నందు అంటాడు. ఆ మాటతో లాస్య ఇప్పుడా..? కష్టం నందు ఆఫీస్‌కు వెళ్లాలి అని చెబుతుంది.
లీవ్ పెట్టమని చెప్పానుకదా నందు అంటే ఆఫీస్‌లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సెలవు తీసుకోవడం కుదరదని లాస్య అంటుంది. శ్రీరామనవమి రోజు జంటగా పూజ చేయడం మా వంశ సాంప్రదాయం.. ఇప్పుడు నువ్వు వెళ్లిపోతే నేను ఒంటరిగా పూజ ఎలా చేయాలి..? అంటాడు నందు. దీనిని అంత ఇష్యూ చేస్తున్నావు ఎందుకు నందు కలిసి కళ్యాణం చేయకపోతే దేవుడు అడుగుతాడా..? కలిసి దండం పెట్టుకుందాం సరిపోతుందని చెబుతుంది. దేవుడి విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు. ఇద్దరం కలిసి పూజ చేయాల్సిందే అని నందు పట్టుపడుతాడు. లాస్య ఒకేసారి గతం గుర్తు చేసుకో నందు.. తులసి నీ భార్య పోస్ట్‌లో ఉన్నప్పుడు నాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేయలేదు. పూజలు, వ్రతాలు అని చంపేస్తుందని ఎన్నిసార్లు చెప్పావు. నువ్వు పూజలు అంటున్నావు ఏమిటి..? నువ్వు మారి నన్ను మారానని అంటున్నవ్.. నువ్వు నందులా ఉండు.. నేను లాస్యలా ఉంటాను. నాకు ఆఫీస్‌కు సమయం అవుతుందని అక్కడ నుంచి వెళ్లిపోతుంది లాస్య. దీంతో నందు పూజకోసం తెచ్చిన సామాన్లు విసిరికొడుతాడు.
Advertisement
అభి నిద్రిస్తుండగా.. తులసి కొడుకుని చూస్తూ ఎమోషనల్ అవుతుంది. బిడ్డల విషయంలో ఏ తల్లికి అయినా స్వార్థం ఎక్కువగా ఉంటుంది. బిడ్డలు ప్పుడు తన కళముందే ఉండాలని అనుకుంటోంది. తన చేతి గోరు ముద్దలే తినాలని,. బిడ్డలకు రెక్కలు వచ్చినా వాటిని పట్టించుకోరని అనుకుంటుంది. పెద్ద అయ్యాక కూడా తన చేతి పట్టుకుని నడవాలనుకుంటుంది. ప్రతీ తల్లి చేసే ఈ తప్పు నేను చేసాను. నా భర్త నాకు దూరమయ్యే సరికి పిల్లలపై మమకారం పెంచుకున్నా.. మీరే జీవితం అనుకున్నాను. మీకంటూ సొంత జీవితం ఉంటుందని తెలుసుకునేవిధంగా చేసావు. నా స్వార్థాన్ని పక్కనబెట్టి నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచిస్తానని.. నా బిడ్డకు సంబంధించిన ముచ్చటలు తీర్చుకోవడానికి ఇది చివరి రోజేమో అని కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తరువాత అభిని నిద్రలోంచి మేల్కోలుపుతుంది. ఇవాళ శ్రీరామనవమి లేచి రెడీ అయితే పూజ చేసుకుందామని అంటుంది. సరే మామ్ అని అభి పది నిమిషాల్లో రెడీ అయిపోతాను అని వెళ్తుండగా.. లేదు నాన్న నిన్ను నేను రెడీ చేస్తాను. ఈ ఒక్కరోజు ఏది అడిగినా కాదనకురా.. తరువాత నీ జోలికి రాను ఆకాశంలో చందమామను చూసినట్టు దూరం నుంచి చూసుకుంటాను అని ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. సరేమామ్.. నువ్వు ఏది అడిగినా కాదన్నావా అని అంటాడు. అభికి నలుగు పెట్టి మరీ స్నానం చేయిస్తుంది తులసి.
Advertisement
నలుగు పెట్టి తలంటూ పోసి తలదువ్వి చిన్న పిల్లాడికి చేసిన విధంగా రెడీ చేస్తుంది. ఇదేమిటి మామ్..నీనేమైనా చిన్న పిల్లాడినా..? అని అభి అనడంతో బిడ్డ ఎంత ఎదిగినా తల్లికి చిన్న పిల్లాడే అని తులసి పేర్కొంటుంది. బ్యాగ్రౌండ్‌తో తందానే తానే తందానో తానానో అంటూ కేజీఎప్ మదర్ సెంటిమెంట్ మ్యూజిక్ వదిలి ఎమోషన్ ఫండే ప్రయత్నించేవారు. ఎప్పుడు లేనిది.. అన్నయ్యని ఇంత ప్రేమగా చూస్తున్నావు అని దివ్య అంటే చెప్పానుగా.. ఈరోజు శ్రీరామనవమి వీడు నా అభిమన్యుడు అంటూ తులసి ప్రేమ కురిపిస్తుంది. ఓరేయ్ మనవడా మీ అమ్మ నిన్ను శ్రీరాముడిని చేసింది వనవాసం చేయాల్సి వస్తుందేమో చూసుకో అని పరందామయ్య అనడంతో అభి షాక్ అవుతాడు. ఏదో సరదాకి అంటే అంతా అలా షాక్ అయ్యారేమిటి నేను వేరే ఉద్దేశ్యంతో అనలేదని పరందామయ్య అంటాడు. మీరు ఏ ఉద్దేశంతో అన్నా జరగాల్సింది జరుగక మానదు. మన చేతిలో ఏమి లేదని తులసి పేర్కొంటుంది.
వాడికి నువ్వు అంటే ప్రాణం.. నీకు వాడు అంటే ప్రాణం.. ఎవ్వరూ దూరం అయ్యే ప్రసక్తే లేదమ్మా అని పరందామయ్య అంటాడు . ఆ మాటతో తులసి జరగబోయే అదే కదా అన్నట్టుగానే మౌనం వహిస్తుంది. ఆ తరువాత పూజా కార్యక్రమం శ్రీరామనవమి పూజలో కొడుకుతో కూర్చుని అతని గురించే ఆలోచిస్తుంది. తులసి దివ్య గమనిస్తూ ఉంటుంది. ఎందుకు అమ్మ ఇలా చేస్తుంది..? ఎప్పుడు లేనట్టుగా అన్నయ్యను అంత ప్రేమగా చూస్తుందని ఆమెలో అనుమానం కలుగుతుంది. పూజలో కూర్చొని అభి అన్నయ్యనే చూస్తున్నావు ఏమిటి మమ్మీ.. నన్ను కూడా చూవచ్చు కదా అని దివ్య అంటుంది. ఇవాళ మామ్‌లో కొత్త మామ్ కనిపిస్తుంది అని, అమ్మ చూపులో కొత్త ఆపేక్ష కనిపిస్తుందని సంతోషపడతాడు అభి.
ఆ తరువాత ఇంటి పెద్ద కోడలు హోదాలో అంకితను పూజ చేయాలని చెబుతుంది తులసి. ఎప్పుడూ నువ్వే పూజ చేస్తావు కాదమ్మా.. ఈ ఇంట్లో దీపం వెలిగించే అర్హత నీకే ఉందమ్మా అని పరందామయ్య అంటాడు. వీళ్ల పైత్యం కాకపోతే.. దేవుడు దగ్గర దీపం వెలిగించడానికి కూడా తులసికి మాత్రమే అర్హత ఉందని అనడం ఏమో కానీ మిగిలిన భజన బ్యాచ్ కూడా నువ్వె దీపం వెలిగించాలంటారు. అర్హతకు సంబంధించి విషయం కాదు ఇది. ఇవాళ అంకిత, అభిలతో పూజ చేయించాలని నా ముచ్చట. అంకితను అందుకే దీపం వెలిగించమంటున్నానని అంటుంది. అంకిత దీపం వెలిగించి పూజను ప్రారంభింస్తుంది. మరో వైపు ప్రేమ్, శృతిలు కూడా సీతారాములకు పూజ చేస్తూ కనిపిస్తారు. రేపటి ఎపిసోడ్‌లో గాయత్రి తులసి ఇంటికొచ్చి అసలు విషయం రివీల్ చేస్తుంది. నా కూతురు, అల్లుడిని పర్మినెంట్‌గా నా ఇంటికి పంపడానికి తులసి ఒప్పుకుందని అందరి ముందు చెబుతుంది. అంకిత కూడా మా అమ్మతో వెళ్లడం నాకు ఇష్టమే చెప్పడం రేపటి ఎపిసోడ్ ట్విస్ట్.. ఆ పంపకాల ముచ్చట రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి :
- రామ్‌చరణ్ ఆ సమయంలో ఏడ్చేశాడంట.. ఎందుకంటే..?
- VIRAL VIDEO : ఈ నడుం పై ఆమ్లెట్ వేయొచ్చు..సన్నీలియోన్ పై మంచు విష్ణు దారుణమైన కామెంట్స్…!
- అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!