తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ సూచనమేరకు పరీక్ష విధానానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆమోదం తెలిపింది. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో మెయిన్స్ పరీక్ష విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్ పేపర్ విధానం, సెక్షన్ల వివరాలు, ప్రశ్నల చాయిస్ వంటి వివరాల కోసం టిఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చని సూచించింది.
Advertisement
Advertisement
గతేడాది డిసెంబర్ 29న 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన విధంగానే ఇవాల్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి తెలిపింది. దరఖాస్తు చేయడానికి కంటే ముందు ఓటిఆర్ అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దని టీఎస్పీఎస్సీ సూచించింది. ఇక దీనిపై TSPSC వెబ్ సైట్ ను సంప్రదిస్తే, అన్నీ వివరాలు క్లారిటీ వస్తాయని వెల్లడించింది.
Advertisement
READ ALSO : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్ జాబ్..రూ. 2,50,000 జీతం!