తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులపై దృష్టి సారించింది. నిరుద్యోగుల ఓట్లను రాబట్టేందుకు… వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే పోలీసు ఉద్యోగాలతో పాటు గ్రూప్ -1,2,3,4 తదితర ముఖ్యమైన నోటిఫికేషన్లన్నీ విడుదలయ్యాయి. టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. తాజాగా మరో 472 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.
Advertisement
రోడ్లు మరియు భవనాల శాఖలో ఈ ఖాళీలను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇంజనీర్ జాబ్స్ నుంచి స్వీపర్ జాబ్స్ వరకు మొత్తం 21 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
Advertisement
అటు తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ మినిస్టిరియల్ సర్వీసు కింద వివిధ జిల్లా కోర్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 163 ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక భాషలో నైపుణ్యం, సంబంధిత స్కిల్స్ ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
read also : విడాకుల కోసం భార్యని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో ..?