గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల దేశ ప్రజలు పండగలకు దూరమయ్యారు కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, దాని నుంచి దేశమంతా కోలుకోవాలని ఎవరి ఇళ్లలో వారు ఉంటూ బిక్కుబిక్కుమని బ్రతుకు వెళ్లదిశారు.. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యదావిధిగా అన్ని పనులు మొదలయ్యాయి.. స్కూళ్ళు తెరుచుకున్నాయి. రెండు సంవత్సరాల నుంచి దసరా, బతుకమ్మ, పండుగకు బ్రేక్ ఇచ్చిన ప్రజలు ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని సెలవులు ప్రకటిస్తుందని అనుకున్నారు.. కానీ తాజాగా దసరా సెలవులను తెలంగాణ ప్రభుత్వం తగ్గించడం కొరకు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (SCERT) ప్రతిపాదన తీసుకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి
Advertisement
ఎప్పుడైనా దసరాకు 14 రోజుల వరకు సెలవులు ప్రకటించే ప్రభుత్వాలు ఈసారి మాత్రం తొమ్మిది రోజుల ఇవ్వాలని రాష్ట్ర విద్యా శాఖ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే జూలై నెలలో కురిసిన వర్షాలకు పాఠశాలలకు అనేక సెలవులు ఇవ్వడంతో, ఏడు రోజుల వరకు పని దినాలు తగ్గిపోయాయని, వాటిని భర్తీ చేయడం కోసం SCERT ఈ ప్రతిపాదన చేసినట్టు సమాచారం.. దీంతోపాటుగా నవంబర్ నుండి ఏప్రిల్ వరకు రెండవ శనివారం కూడా పాఠశాలలు పనిచేయాలని ప్రతిపాదన తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.. మరి దీనిపై రాష్ట్ర విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే ఈ నెల 26వ తేదీ నుండి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే..
టిటియు సీరియస్ మా తల్లులు బతుకమ్మ ఆడుకోవద్దా..?
దసరా సెలవులు రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు జరుపుకునే పండగకు ఆటంకం కలిగించడం సమంజసం కాదని, తెలంగాణ సమాజాన్ని అవమానపరచడమే అని టీటీయు తెలియజేస్తోంది. ఒక అకాడమిక్ క్యాలెండర్ లో ఉండే పని దినాల కంటే ఎక్కువ పనిదినాలు ఉన్నప్పటికీ రెండో శనివారం పనిచేయాలని ఆదేశించడానికి జరిగే ప్రయత్నాలను టిటియు వ్యతిరేకిస్తోంది..
also read:కృష్ణంరాజు కోసం 12 ఏళ్ల తరువాత తొలిసారి ప్రభాస్ అక్కడికి..!