Home » తెలంగాణ గ‌వర్న‌ర్‌తో క‌లిసి ఎమ్మెల్యే రోజా మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు.. ఫొటోలు వైర‌ల్‌..!

తెలంగాణ గ‌వర్న‌ర్‌తో క‌లిసి ఎమ్మెల్యే రోజా మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు.. ఫొటోలు వైర‌ల్‌..!

by Anji
Ad

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తో క‌లిసి ఏపీ ఎమ్మెల్యే రోజా ముందస్తుగానే కేకు క‌ట్ చేసి మ‌హిళాదినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకున్నారు.


మార్చి 08న ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్‌భ‌వ‌న్ లో ప‌ని చేసే మ‌హిళా మూర్తులు కొంత మందికి వీళ్లు స‌న్మానించారు. వీళ్లిద్ద‌రూ ఫోటోల‌కు చిరున‌వ్వులు చిందించారు. రోజా చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా.. భ‌ర్త సెల్వ‌మ‌ణిది త‌మిళ‌నాడు. త‌మిళి సై స్వ‌త‌హాగా త‌మిళ‌నాడుకు చెందిన వారు కావ‌డంతో వీరిద్ద‌రూ ఎంతో ఆత్మీయంగా క‌లుసుకోవ‌డం ఎంతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Advertisement

గ‌తంలో త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షురాలుగా ప‌ని చేసిన త‌మిళి సై.. 2019 సెప్టెంబ‌ర్ 08 నుంచి తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేవ‌లం తెలంగాణ‌కు మాత్ర‌మే కాకుండా.. గ‌త ఏడాది కాలంగా పుదుచ్చేరి ఇన్‌చార్జీ లెప్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు.

Also Read :  రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ పంచ్ మామూలుగా లేదుగా..!

Advertisement

ఇక రోజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. రోజా సినిమాల్లోకి రాక‌ముందు త‌న కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అల‌రించింది. ఆ త‌రువాత క‌థానాయిక‌గా రోజా న‌టించిన మొద‌టి చిత్రం ప్రేమ త‌పస్సు. ఈ చిత్రాన్ని దివంగ‌త న‌టుడు, మాజీ ఎంపీ ఎన్‌.శివ‌ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా న‌టించిన సినిమాలో రోజా హీరోయిన్‌గా న‌టించింది. ఆ త‌రువాత ఛాన్స్‌లు లేక ఖాళీగా ఉంది. అదే స‌మ‌యంలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌.. సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో శోభ‌న్‌బాబు హీరోగా సర్ప‌యాగం సినిమాలో హీరో కూతురు పాత్ర‌లో రోజా అల‌రించింది. ఈ సినిమా స‌క్సెస్‌తో రోజా వెనుదిరిగి చూసుకోలేదు.

త‌మిళంలో రోజా త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చెంబరుతి అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాను తెలుగులో చామంతి అనే పేరుతో డ‌బ్ చేసి విడుద‌ల చేశారు. త‌న‌ను త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు సెల్వ‌మ‌ణినే ఆమె పెళ్లాడ‌టం విశేషం. త‌న ప్రేమ విష‌యం ముందు రోజా వాళ్ల ఇంట్లో చెప్పి వాళ్లు ఒప్పుకున్న త‌రువాత రోజాకు చెప్పి ఒప్పించారు. ప్ర‌స్తుతం న‌గ‌రి ఎమ్మెల్యే రోజా గ‌తంలో ఏపీఐఐసీ చైర్మ‌న్‌గా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

Also Read :  కాంగ్రెస్ బ‌ల‌పడేందుకు రేవంత్‌రెడ్డి వ్యూహం అదేనా..?

 

Visitors Are Also Reading