Home » మహేష్ ను ఢీ కొట్టే పాత్రలో గోపీచంద్…యాక్షన్ వేరే లెవల్…!

మహేష్ ను ఢీ కొట్టే పాత్రలో గోపీచంద్…యాక్షన్ వేరే లెవల్…!

by AJAY
Ad

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ బాబు ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ చిత్రం కూడా పూర్తయ్యాక మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వం లో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

Advertisement

వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఆ కోరిక ఇప్పుడు తీరబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ను ఢీ కొట్టే పాత్రలో గోపీచంద్ నటించబోతున్నాడు అని తెలుస్తోంది.

Advertisement

ఇప్పటికే గోపీచంద్ కు కథ చెచ్చగా ఈ హీరో ఓకే చెప్పాడట. ఇక ఇప్పటికే నిజం సినిమాలో గోపీచంద్ మహేష్ బాబుకు విలన్ గా నటించాడు. అయితే రాజమౌళి దర్శకత్వం లో మహేష్ బాబు గోపీచంద్ తలపడుతే ఆ కిక్ వేరే లెవల్ లో ఉంటుంది అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ పక్కా కమర్షియల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

Visitors Are Also Reading