Home » ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న గోపీచంద్…కానీ !

ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్న గోపీచంద్…కానీ !

by Bunty
Ad

స్టార్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గోపీచంద్ మొదటగా విలన్ గా నటించి ఆ తర్వాత హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను హీరోగా చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే గోపీచంద్ సినిమాలలో నటిస్తున్న సమయంలో ఒక హీరోయిన్ ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడట. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.

Advertisement

గోపీచంద్ ఇండస్ట్రీకి “తొలివలపు” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో గోపీచంద్ సరసన స్నేహ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మొదటి చూపులోనే స్నేహను చూసి ప్రేమలో పడిపోయారట. ఇక తననే పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యాడట. ఇక స్నేహకి ప్రపోజ్ చేద్దామని అనుకున్న సమయంలో… స్నేహ వేరే వ్యక్తులతో గోపీచంద్ తనకు అన్నయ్య లాంటివాడు అని చెప్పిందట. ఇక ఆ విషయాన్ని గోపీచంద్ కూడా విన్నారట.

Advertisement

ఇక దాంతో గోపీచంద్ చాలా ఫీల్ అయ్యి తన మనసులో నేను ఒక అన్నయ్య స్థానం సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నానని చెబితే తనకి నా మీద ద్వేషం మొదలవుతుంది అని అనుకున్నాడట. దీంతో స్నేహకి ప్రపోజ్ చేయకుండానే వెళ్ళిపోయాడట. ఇక గోపీచంద్ రష్మీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతున్నాడు గోపీచంద్.

 

ఇవి కూడా చదవండి

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

శ్రీ లీల కారణంగానే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా…!

Visitors Are Also Reading