Home » గూగుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 9ల‌క్ష‌ల యాప్స్ తొల‌గించేందుకు సిద్ధం..! కార‌ణం ఏమిటంటే..?

గూగుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. 9ల‌క్ష‌ల యాప్స్ తొల‌గించేందుకు సిద్ధం..! కార‌ణం ఏమిటంటే..?

by Anji
Ad

యూజ‌ర్ల భ‌ద్ర‌త‌కు పెద్ద‌పీట వేయ‌డంలో గూగుల్ చాలా ముందే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త అప్‌డేట్‌తో ర‌క్ష‌ణ క‌లిపిస్తుంది. తాజాగా యాప్స్ య‌జ‌మానుల‌కు గూగుల్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముఖ్యంగా ప్లే స్టోర్‌లో ఉన్న యాప్స్‌ను అప్‌డేట్ చేయాలని.. లేదంటే వాటిని తొల‌గిస్తాం అని చెప్పింది. గూగుల్ ప్లే స్టోర్‌లో దాదాపు 8.69 ల‌క్ష‌ల ఆండ్రాయిడ్‌, యాపిల్ యాప్ స్టోర్‌లో 6.50 ల‌క్ష‌ల ఐఓఎస్ యాప్స్ ను తొల‌గించేందుకు ఆ రెండు సంస్థ‌లు సిద్ధ‌మ‌య్యాయి. రెండేండ్ల నుండి అప్‌డేట్ కానీ యాప్స్ అప్‌డేట్ చేయాలని, వాటి డెవ‌ల‌ప‌ర్ల‌కు గూగుల్, యాపిల్ వార్నింగ్ ఇచ్చాయి.

Advertisement

ప‌ర్స‌న‌ల్ యాప్స్, ఇన్‌స్టంట్ ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్స్‌, ప‌ర్స‌న‌ల్ లోన్ యాప్స్‌, ఫేక్ లోన్ యాప్స్‌, వ్య‌క్తిగ‌త రుణాలకు సంబంధించి గ‌డువులోపే ఈ యాప్స్‌ను అప్‌డేట్ చేయాల‌ని గూగుల్‌తో పాటు యాపిల్ సైతం హెచ్చ‌రించాయి. డెవ‌ల‌ప‌ర్లు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వాటిని డిలీట్ చేయ‌నున్నాయి. ఇది యూజ‌ర్ల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు గూగుల్ పేర్కొంటుంది. ఇక గూగుల్ నుంచి మ‌రొక అద్భుత‌మైన ఫీచ‌ర్ వ‌చ్చేసింది. ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ చేసి, వాటికి పాస్‌వ‌ర్డ్ పెట్టుకునే వారిలో ప్ర‌ధానంగా ఉండే భ‌యం పాస్‌వ‌ర్డ్ లీక్ అవుతుందేమోన‌ని.. దాదాపు ఈ స‌మ‌స్య‌ను అంద‌రూ ఫేస్ చేస్తుంటారు. అకౌంట్ పాస్‌వ‌ర్డ్ ఇత‌రుల చేతుల్లోకి వెళ్లిందంటే యూజ‌ర్ల‌కు అది పెద్ద రిస్కే అని చెప్ప‌వ‌చ్చు. స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్ పెట్టుకోవ‌డం ద్వారా ఈ రిస్క్ త‌గ్గించుకోవ‌చ్చు. ముఖ్యంగా యూజ‌ర్ల పాస్ వ‌ర్డ్ ఆన్‌లైన్‌లో లీక్ అయిన‌ట్టు అయితే గూగుల్ అసిస్టెంట్ వెంట‌నే అప్ర‌మ‌త్తం చేస్తుంది. పాస్‌వ‌ర్డ్‌ను ఆటోమెటిక్‌గా మార్చేస్తుంది.

Advertisement

వాస్త‌వానికి ఈ ఫీచ‌ర్‌ను గూగుల్ గ‌త ఏడాదే ప్ర‌క‌టించింది. ఆండ్రాయిడ్‌యూజ‌ర్ల‌కు క్రోమ్‌లో ఈ ఫీచ‌ర్ ఉంది. యూజ‌ర్ల అకౌంట్ల‌కు సంబంధించిన ఏదైనా పాస్‌వ‌ర్డ్ లీక్ అయిన‌ట్ట‌యితే వెంట‌నే గూగుల్ అసిస్టెంట్ యూజ‌ర్ల‌కు ‘Change your Password Now’ అని నోటిఫికేష‌న్ ద్వారా స‌మాచారం ఇస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ‘Change Automatically’ అనే ఆప్ష‌న్ ఉంటుంది. ఈ ఆప్ష‌న్ ఎంచుకున్న‌ట్ట‌యితే మీ అకౌంట్ పాస్‌వ‌ర్డ్ ఆటోమెటిక్‌గా మారిపోతుంది. లేదంటే మ్యాన్యువ‌ల్‌గా పాస్‌వ‌ర్డ్ కూడా మార్చుకునే ఆప్ష‌న్ ఉంటుంది. ఆటోమెటిక్‌గా పాస్‌వ‌ర్డ్ అప్‌డేట్ చేసే ఆప్ష‌న్ కొన్ని వెబ్‌సైట్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది.

ఇక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తుంది. ఈ ఫీచ‌ర్ వ‌చ్చాక యూజ‌ర్లు త‌మ పాస్‌వ‌ర్డ్‌ను ప్రొటెక్ట్ చే కోవ‌చ్చు. అదేవిధంగా ఇప్ప‌టికే మీరు క్రోమ్‌లో స్టోర్ చేసిన పాస్ వ‌ర్డ్‌లో వీక్ పాస్ వ‌ర్డ్ ఉన్న‌ట్ట‌యితే వాటి గురించి క్రోమ్ హెచ్చ‌రిస్తుంది. మీ పాస్ వ‌ర్డ్‌ను ఒకేసారి చెక్ చేసి వీక్‌గా ఉన్న పాస్ వ‌ర్డ్‌ను మార్చుకోవ‌చ్చు. మీ పాస్ వ‌ర్డ్‌నుమెనేజ్ చేయ‌డానికి స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకోవ‌డానికి గూగుల్ పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ గూగుల్ పాస్‌వ‌ర్డ్ మేనేజ‌ర్ మీ పాస్‌వ‌ర్డ్ పై నిఘా ఉంచి.. అందులో లీకు అయిన పాస్‌వ‌ర్డ్స్‌ని గుర్తించి అప్ర‌మ‌త్తం చేస్తుంది. దీంతో పాటు స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్‌ను సూచిస్తుంది. ఇక యూజ‌ర్లు స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్ పెట్టుకుంటే మీ అకౌంట్ హ్యాక్ అయ్యే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గానే ఉంటాయి.

Also Read : 

విడదల రజినీ నాకు అందుకే నచ్చదు, నేను వైసీపీ కాదు….క్లారిటీ ఇచ్చిన శ్రీరెడ్డి…!

భార్య భర్తల మధ్య అనుమానాలు రావడానికి ఈ లక్షణాలే కారణమట…!

Visitors Are Also Reading