మనకు ఏమైనా సందేహం వస్తే ప్రతి ఒక్కరూ ఉపయోగించేది గూగుల్. ఎలాంటి డౌట్ వచ్చినా గూగుల్ లో సెర్చ్ చేసి చూస్తాము. దీనిని గూగుల్ తల్లి అని ప్రేమగా పిలుచుకుంటాము. గూగుల్ 1998లో ప్రారంభమైంది. ఇక గూగుల్ తల్లికి 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ 25 సంవత్సరాలలో తన సెర్చ్ బాక్స్ లో ఎక్కువమంది వెతికిన టాపిక్స్ ను ప్రకటించింది గూగుల్.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ ఉన్న క్రికెట్ లో అత్యధిక మంది వెతికిన పేరు విరాట్ కోహ్లీ. సచిన్, ధోని లాంటి సమకాలికులైన క్రికెటర్లకు ఏమాత్రం అందని స్థాయిలో నెటిజన్ల ఆదరణను, ఆసక్తిని దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ పాతికేల్లలో ఎక్కువమంది వెతికిన క్రికెటర్ గా నిలిచి తనకున్న క్రేజ్ ను చాటుకున్నాడు కోహ్లీ.
Advertisement
ఓవరాల్ గా అథ్లెట్స్ విషయానికి వస్తే ఆ స్థానాన్ని క్రిస్టియానో రోనాల్డో దక్కించుకున్నాడు. మరి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన మూమెంట్ ఏంటో తెలుసా…. చంద్రుడిపై తొలిసారిగా మనిషి కాలు మోపిన సందర్భం. చంద్రుడిపై అడుగుపెడుతున్న క్షణాన్ని చూడాలని చాలామంది గూగుల్ లో వెతికారు. ఇవే కాకుండా మోస్ట్ సెర్చ్ మూవీస్ ను కూడా గురించింది గూగుల్.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!