వెంట్రుకలు ఊడిపోకుండా బలంగా జుట్టు కుదుళ్లను పట్టి ఉంచాలంటే తల పైభాగంలో ఉండే స్కిన్ లోపలి పొరలో కొలాజెన్ అనేది ఉంటుంది. ఈ కొలాజెన్ అనేది హెల్దీగా ఉంటే జుట్టు ఊడిపోకుండా వెంట్రుకలను బలంగా పట్టి ఉంచుతుంది. తల పైభాగంలో ఉండే చర్మంలోని లోపలిపొర లోని కొలాజెన్ దెబ్బతింటే జుట్టు కుదుళ్లు బలహీనమవుతాయి. దీని ద్వారా జుట్టు ఎక్కువగా ఊడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి కొలాజెన్ ని హెల్దీగా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. జామ చెట్టు ఆకులు జుట్టుకి కోలాజెన్ ని పెంచుతాయని శాస్త్రీయంగా నిర్ధారించబడింది.
Advertisement
జామాకులలో ఉండే విటమిన్ సి, కొన్ని కెమికల్ కాంపౌండ్స్ జుట్టు కుదుళ్ల లోని కొలాజెన్ ని బాగా పెంచి, కుదుళ్లను బాగా పట్టి ఉంచేటట్లు చేస్తుంది. కొలాజెన్ మెష్ హెల్దీగా తయారైతే జుట్టు కుదుళ్లకు బలం పెరుగుతుంది. అలాగే జామ ఆకుల్లో ఉండే లైకోపీన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఎక్కువ మోతాదులో ఉండటంవల్ల ఎండ యొక్క యూ.వీ. కిరణాల నుండి జుట్టును రక్షించడానికి ఉపయోగపడుతుంది. యూ.వి.కిరణాలు మన జుట్టు మీద పడడం వల్ల జుట్టు ఎరుపెక్కడం, జుట్టు చివరలో చిట్లిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.
Advertisement
యూ.వి. కిరణాల నుండి జుట్టును కాపాడడానికి జామాకులు ఉపయోగపడుతున్నాయి. జామ ఆకుల వల్ల జుట్టు కి రెండు రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ జామాకులు యొక్క పేస్ట్ ని తలపై మాడ భాగంలో బాగా పట్టించాలి. పదినిమిషాల పాటు వేళ్లతో జుట్టు కుదుళ్లను రుద్దుకుంటూ ఉంటే కెమికల్ ఎఫెక్ట్ బాగా పనిచేసి జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే జామ ఆకులను నీళ్లలో వేసి మరిగించి ఆ తర్వాత డికాషన్ గా వడగట్టి ప్యూర్ జామాకుల డికాషన్ ను కూడా జుట్టుకు పట్టిస్తే అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ జుట్టు కుదుళ్లు బలంగా ఉంచడానికి తోడ్పడతాయి.
ఇవి కూడా చదవండి :
టీ తాగేటప్పుడు ఎట్టి పరిస్థితిలో వీటిని అస్సలు తీసుకోకూడదు జాగ్రత్త..!
చెరకు రసం తయారు చేసేటప్పుడు గడల మధ్య నిమ్మకాలు ఎందుకు ఉంచుతారో తెలుసా..?
అరటి ఆకులో భోజనం ఎలా ప్రారంభం అయ్యింది ? కాస్త చరిత్రలోకి !