Home » ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ చిన్న టిప్స్ పాటించాల్సిందే.. పక్కన బాంబు పేలిన లేవరనుకోండి..!!

ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఈ చిన్న టిప్స్ పాటించాల్సిందే.. పక్కన బాంబు పేలిన లేవరనుకోండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రతి మనిషికి కడుపునిండా తిండి..కంటి నిండా నిద్ర..ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.. కానీ ప్రస్తుత సమాజంలో చాలామంది డబ్బు వేటలో పడి నిద్ర కూడా సరిగా పోవడం లేదు. దీని వల్ల అనేక రోగాలు దరిచేరి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక మరికొంతమంది మాత్రం రాత్రి తొందరగా పడుకున్నా కంటినిండా నిద్ర పోయే సరికి చాలా ఆలస్యం అవుతుందట. ఎంత నిద్రపోదామని అనుకున్నా నిద్ర పట్టక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక సర్వేలో తేలింది.. అయితే అలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు కొన్ని టెక్నిక్స్ తెలిపారు. అవి పాటిస్తే ఇట్టే నిద్ర పట్టి ఇక లేవమన్నా లేవరు.. ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

also read:ఈ లెటర్స్ తో పేర్లు స్టార్ట్ అయ్యే అమ్మాయిలు, కావాలనుకున్న అబ్బాయిని అస్సలు వదిలిపెట్టరు..!!

Advertisement

Advertisement

ప్రతి ఒక్కరిలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది మన చుట్టుపక్కల చీకటి గా ఉన్నప్పుడు మరింత పెరుగుతుంది. దీనివల్ల నిద్ర చాలా హాయిగా పడుతుంది. చీకటిలో స్పందనగా మెదడులో ఉండే పీనియల్ గ్రంథి దీన్ని విడుదల చేస్తుంది. అందువల్ల మెలటోనిన్ హార్మోన్ వల్ల నాడీ సంబంధ క్రియలు మందగిస్తాయి. మన శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. దీనివల్ల నిద్రలోకి జారుకుంటారు. కానీ కొంతమంది చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఈ హార్మోన్ విడుదల కాస్త లేట్ అవుతుంది. అందువల్ల నిద్ర సరిగా పట్టక ఇబ్బందులు పడుతుంటారు. అవేంటో చూద్దాం..


సాయంకాల సమయంలో చాలామంది కాఫీ, టీలకు టాటా చెప్తే మంచిది. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మెదడులో విశ్రాంతి ఉండదు. దీని వల్ల నిద్ర పట్టదు. అలాగే నిద్ర కు మొబైల్, టీవీ,ల్యాప్ టాప్ లు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. నిద్రపోయే రెండు మూడు గంటల ముందు వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. అలా అయితేనే హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా సుఖవంతమైన నిద్ర కోసం కూరగాయలు, గుమ్మడి గింజలు, అవకాడో వంటివి ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading