Telugu News » లావణ్య జాతకం మంచిదే..ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కటి కాబోతున్న మెగా జంట ?

లావణ్య జాతకం మంచిదే..ఇంట్లో అడుగు పెట్టగానే ఒక్కటి కాబోతున్న మెగా జంట ?

by Bunty
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందాల రాక్షసి సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి… ఇప్పటికీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కొనసాగిస్తోంది. ఇక ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ తేజ్ ను పెళ్లాడింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.

Advertisement

లావణ్య త్రిపాటి మరియు హీరో వరుణ్ తేజ్ వివాహం నవంబర్ మాసం మొదటి వారంలో ఇటలీలో జరిగింది. మెగా కుటుంబం మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్లు ఈ వివాహానికి హాజరయ్యారు. దాదాపు ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ జంట… పెద్దలను ఒప్పించి,పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న లావణ్య త్రిపాఠి జాతకం గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా ఇంట్లో అడుగుపెట్టగానే… ఆ కుటుంబానికి శుభవార్త అందిందట. ఇటీవల మెగా కుటుంబానికి చెందిన ఓ జంట విడిపోయింది. అయితే లావణ్య అడుగుపెట్టగానే ఈ జంట మళ్ళీ కలవనుందట. మనస్పర్ధలను పక్కకు పెట్టి.. త్వరలోనే మెగా కుటుంబానికి చెందిన ఆ జంట కలవబోతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… అందరూ నిహారిక మరియు జొన్నలగడ్డ ఇద్దరు కలవబోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading