Home » ఐఫోన్ అంటే ఇష్ట‌ప‌డే వారికి శుభ‌వార్త‌.. ఆ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

ఐఫోన్ అంటే ఇష్ట‌ప‌డే వారికి శుభ‌వార్త‌.. ఆ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

by Anji

ఐఫోన్ కొనాల‌ని చాలా మందికి ఆశ ఉంటుంది. కానీ డ‌బ్బులు లేక చాలా మంది మిగ‌తా స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేస్తుంటారు. వారి కోరిక నేర‌వేర్చేందుకు ప్ర‌ముఖ మొబైల్ త‌యారీదారు యాపిల్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ప్రోడ‌క్ట్స్ లాంఛ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ యాపిల్ ఐఫోన్ 13ని గ్రీన్ క‌ల‌ర్ లాంచ్ చేసిన‌ది. స్ప్రింగ్ ఈవెంట్‌లో భాగంగా ఐఫోన్ ఎన్ఈ-3 , ఐపాడ్ ఎయిర్, మ్యాక్ స్టూడియోని ప‌రిచ‌యం చేసిన‌ది.ప్ర‌స్తుతం ఈ ఐఫోన్ 13 గ్రీన్ క‌ల‌ర్ ఫోన్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ఐఫోన్ 13 స్టాక్ అయిపోక‌ముందే మీరు కూడా దీనిని సొంతం చేసుకోవాల‌ని చూస్తున్నారా..? అయితే మీ కోస‌మే తాజాగా యాపిల్ రీసెల్ల‌ర్ ఇండియా ఐస్టోర్ అదిరిపోయే ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. మ‌రీ ఆ ఆఫ‌ర్ ఏమిటి..? డిస్కౌంట్‌తో ఎలా పొందాల‌నే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్కౌట్‌కు సంబంధించిన వివ‌రాలు : 

  • ఇండియా ఐస్టోర్ వెబ్ సైట్ వెనిలా, పింక్‌, రెడ్, బ్లూ, గ్రీన్ క‌ల‌ర్స్‌లోని ఐఫోన్ 13పై రూ.5వేలు ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఐఫోన్ 13 ధ‌ర రూ.79,900 నుండి రూ.74,900కి త‌గ్గింది.
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజ‌ర్ల‌యితే రూ.4వేల వ‌ర‌కు క్యాష్ బ్యాక్ అందుకోవ‌చ్చు. ఈ ఆఫ‌ర్‌తో క‌లిపి ఐఫోన్ 13ని రూ.70, 900కి ద‌క్కించుకోవ‌చ్చు.
  • ఇక వీటితో పాటు ఒక ఎక్సేంజ్ ఆఫ‌ర్ కూడా ఉంది. యాపిల్ రీసెల్ల‌ర్ అందిస్తున్న ఎక్సేంజ్ ఆఫ‌ర్ కింద మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను విక్ర‌యించి ఐఫోన్ 13 ధ‌ర‌ను మ‌రింత తగ్గించుకోవ‌చ్చు.

చాలా ఆక‌ర్ష‌ణీయమైన ఆఫ‌ర్ల‌తో మీరు ఐఫోన్ 13ని రూ.52,900కే సొంతం చేసుకోవ‌చ్చు. యాపిల్ ఐఫోన్ 13పై మీరు ఏకంగా రూ.27వేల డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ వ‌ర్కింగ్ కండిష‌న్ ఆధారంగా మాత్ర‌మే ఈ ధ‌ర నిర్ణ‌యించారు. యూజ‌ర్లు త‌మ ఫోన్ గురించి నిజ‌మైన స‌మాచారాన్ని అందించాలి. ఈ డిస్కౌంట్ కేవ‌లం గ్రీన్ ఐఫోన్ 13పై మాత్ర‌మే కాదు. ఈ ఆఫ‌ర్లు వ‌నిల్లా ఐఫోన్ 13 మోడ‌ల్‌లోని అన్ని రంగుల‌కు వ‌ర్తిస్తాయి.

Also Read : 

క‌థ న‌చ్చినా “జోష్” సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది..5 కార‌ణాలు ఇవేనా..!

అందరి హీరోయిన్స్ కి కలిసి నటించిన బాలయ్య ఎందుకు శ్రీదేవి తో నటించలేదు ? దాని వెనుకున్న కారణం అదేనా ?

 

Visitors Are Also Reading