నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంతో అక్కడక్కడ భారీ వర్షాలే కురుస్తున్నాయి. వర్షాకాలం సీజన్ పంటలకు రైతన్నలు ఇప్పటికే సమాయత్తం కాగా.. వారికి పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వాస్తవానికి జూన్ 20 తరువాత రైతుబంధు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొదటి వారం నుంచే రైతుబంధు ఇవ్వాలని అనుకున్నా సమస్యల కారణంగా ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం పలు సంస్థల నుంచి కొత్త ఆప్పులు వస్తుండడంతో ఆదాయం నుంచి కూడా నిధులు సర్దుబాటు చేసి రైతుబంధు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
Advertisement
Advertisement
2018లో రైతు బంధు పథకం ప్రారంభమైనప్పుడు మే నెలలోనే రైతులకు డబ్బులు అందజేశారు. కొన్ని సీజన్లలో పెట్టుబడి సహాయం అందించడం కాస్త ఆలస్యం అయింది. వానకాలం అయితే జూన్ జూలైలో యాసంగి పంటలకు అయితే జనవరి ఫిబ్రవరి నెలల్లో రైతుబధు ప్రభుత్వం ఇస్తుంది. గత యాసంగి సీజన్ వరకు 66. 61 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి. 152.91 ఎకరాల రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి.
ఇందులో 62.99 లక్షల మంది రైతులకు రూ. 7,411.52 కోట్లకు పైగా రైతుబంధు పెట్టుబడి సాయం అందించింది. 2022 జూన్ సీజన్లో పట్టాదారులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలను సిద్ధం చేసింది. రైతుబంధు కోసం 7,700 కోట్ల అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఆ మొత్తం ఒకేసారి వేస్తే ఇబ్బందులు వస్తాయి అనే ఉద్దేశంతో విడతల వారీగా రైతుబంధు ప్రభుత్వం అందించనున్నది.