Telugu News » తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌.. రైతు బంధు నిధులు విడుద‌ల ఎప్పుడంటే..?

తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌.. రైతు బంధు నిధులు విడుద‌ల ఎప్పుడంటే..?

by Anji

తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త చెప్పింది. జూన్ 28 నుంచి వానాకాలమున‌కు సంబంధించిన రైతుబంధు నిధులు అర్హులైన వారి ఖాతాలో జ‌మ‌చేయాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సీఎస్ సోమేష్‌కుమార్ ను ఆదేశించారు. వెంట‌నే సీఎస్ సోమేష్ కుమార్ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసారు. ఇక ఈ సీజ‌న్‌లో దాదాపు 8వేల కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని స‌మాచారం.

Ads

ఆ నిధుల‌ను స‌మీక‌రించిన ప్ర‌భుత్వం ఈనెల 28 నుండి నిధులను విడుద‌ల చేయ‌నుంది. తొలుత త‌క్కువ భూమి విస్తీర్ణం ఉన్న రైతుల నుంచి ప్రారంభం క్ర‌మ క్ర‌మంగా అంద‌రి ఖాతాల్లో డ‌బ్బుల‌ను జ‌మ చేయ‌నున్నారు. ఇక రైతుబంధు పై వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ఫిర్యాదులు చేసేందుకు త్వ‌ర‌లోనే టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుల కోసం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలు, విజ్ఞ‌ప్తులు తీసుకునేందుకు ఇక ఈ కాల్ సెంట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వెల్ల‌డించారు.

వానాకాలం, యాసంగి సీజ‌న్ల‌లో ఎక‌రానికి ఐదు వేల చొప్పున మొత్తం 10వేల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా పెట్టుబ‌డి సాయంగా ఇస్తున్న విష‌యం విధిత‌మే. ధాన్యంకొనుగోళ్లు, రైతుబంధు డ‌బ్బులు ఇలా తెలంగాణ‌లో రాజ‌కీయం మొత్తం రైతుల చుట్టూ తిరుగుతుంది. రైతు బంధు ప‌థ‌కం ఈసారి రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. రైతు బంధు ఆల‌స్యంపై విప‌క్షాల‌న్నీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. నిధుల ఆల‌స్యానికి కేంద్ర‌మే కార‌ణం అని ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు.


You may also like