పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రాధేశ్యామ్ సినిమా లో రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించి నున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రాధేశ్యామ్ చిత్ర బృందం ట్విట్టర్ అకౌంట్ ద్వార ప్రకటించింది. దీంతో రెబల్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు గత కొద్ది రోజుల నుంచి ఆనారోగ్యం కారణంగా సినిమాల కు దూరం గా ఉంటున్నారు. అయితే తాజా గా రాధేశ్యామ్ సినిమా లో నటించడం తో చాలా రోజుల తర్వాత కెమేర ముందుకు కృష్ణం రాజు రానున్నాండు.
Ad
అయితే కృష్ణం రాజు రాధేశ్యామ్ సినిమా లో పరమహంస అనే పాత్రలో కనిపించబోతున్నాడని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటో ను కూడా చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా అభిమానుతో పంచుకుంది. అలాగే టాలీవుడ్ లేజండరీ నటుడు కృష్ణం రాజ్ అంటు ఒక క్యాప్షన్ ను కూడా పెట్టింది. అలాగే ఈ సినిమా లో కృష్ణం రాజు పరమహంస పాత్రలో నటిస్తున్నాడని కామెంట్ చేసింది. కాగ ప్రభాస్ , కృష్ణంరాజు కలిసి గతంలో కూడా నటించారు. బిల్లా, రెబల్ సినిమా లలో వీరు ఇద్దరు కలిసి నటించారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా పెద్ద గా ఆడటలేదు.
దీంతో కొంత మంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇద్దరు కలిసి చేసిన బిల్లా, రెబల్ పెద్దగా రాణించలేదని.. ఈ సినిమా పరిస్థితి ఎంటని ట్రోల్స్ చేస్తున్నారు. మరి కొంత వీరి కాంబినేషన్ లో సరి కొత్త రికార్డు క్రియేట్ చేస్తారని అంటున్నారు. కాగ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న పాన్ ఇండియా రెంజ్ లో విడుదల కానుంది. ఇప్పటి కే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, పాటలు ప్రేక్షకులను మెప్పించాయి.
Introducing The Legendary Actor, Rebel Star Dr. @uvkrishnamraju garu as #Paramahamsa from #RadheShyam.#Prabhas @hegdepooja @director_radhaa @justin_tunes @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @RadheShyamFilm #RadheShyamTrailerOnDec23 pic.twitter.com/1eimJqgZUt
— BA Raju's Team (@baraju_SuperHit) December 20, 2021