Home » ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త..!

by Azhar
Ad
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఏ రేంజ్ లో నిరాశాలో ఉన్నారు అనేది అందరికి తెలుసు. ఎప్పుడో మార్చ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాతో దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్.. ఇక ఫాస్ట్ గా సినిమాలు చేస్తాడు అని భావించారు. అనుకున్న విధంగానే ఎన్టీఆర్ కొరటాలతో ఒక్క సినిమా ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా అనేది ప్రకటించి అందరిని ఖుషి చేసారు.
అయితే ఇందులో మొదట మొదలు కావాల్సిన కొరటాల సినిమా షూటింగ్ అనేది ఇంకా ప్రారంభం కాపాడంతో ఫ్యాన్స్ నిరాశలోకి వెళ్లిపోయారు. ఇన్ని రోజులు అయిన ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభం కావడం లేదు అనే ఫ్యాన్స్ కు ఇప్పుడు ఓ గుడ్ అనేది అందుతుంది. అయితే ఇంత ఆలస్యం అనేది కొరటాల.. తన గత సినిమా ఆచార్యలోని తప్పులు మళ్ళీ జరగకుండా కథ పైన బాగా పని చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఈ క్రమంలోనే తాజాగా ప్రారంభం అయిన అల్లు స్టూడియోస్ లో ఎన్టీఆర్, కొరటాల సినిమాకు సంబంధించిన భారీ సెట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అని తెలుస్తుంది. ఇక ఈ సెట్ అనేది పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ను కొరటాల ప్రారంభించనున్నాడు అని తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న దీనిని భారీగా కొరటాల ప్లాన్ చేసాడు అని సమాచారం. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading