Home » మెగా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. రామ్ చ‌ర‌ణ్ సినిమా టైటిల్ లాక్

మెగా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. రామ్ చ‌ర‌ణ్ సినిమా టైటిల్ లాక్

by Anji
Ad

మెగా అభిమానుల‌కు ఓ శుభ‌వార్త‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బాస్ట‌ర్ సినిమా త‌రువాత చేస్తున్న సినిమా ఆర్‌సీ 15 ద‌ర్శ‌కుడు శంక‌ర్ టాలీవుడ్ హీరో ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తో పాటు ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతుంది. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బ‌రాజు క‌థ‌ను అందించారు. అయితే ఆర్‌సీ 15 సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ త్రిబుల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ సినిమా టైటిల్ కూడా ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు శంక‌ర్ లాక్ చేసిన‌ట్టు స‌మాచారం.

Advertisement

 

తాజాగా ఈ చిత్రం టైటిల్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రానికి తొలుత స‌ర్కారోడు అనే టైటిల్ శంక‌ర్ టీమ్ ప‌రిశీలిస్తుంద‌ట‌. ప్ర‌స్తుతానికి ఈ న్యూస్ వైర‌ల్ అవుతున్న‌ప్ప‌టికీ దీనిపై మాత్రం అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. స‌ర్కారోడు, అధికారి అనే టైటిళ్ల‌ను ప‌రిశీలన చేస్తోంది. ఇక ఫైన‌ల్‌గా అధికారి అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ రాజ‌మండ్రి లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో కూడా నిర్వహించారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాజోలు సుంద‌రి అంజ‌లి, క‌న్న‌డ యాక్ట‌ర్ జ‌య‌రామ్‌, టాలీవుడ్ యాక్ట‌ర్ న‌వీన్ చంద్ర ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ కు జోడిగా బ్యూటిపుల్ హీరోయిన్ కియారా అద్వాని న‌టిస్తుంది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement


ఈ పిక్స‌ర్ పైన భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. విడుద‌ల‌కు ముందే ఈ చిత్ర నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను ప్ర‌ముఖ మీడియా సంస్థ ZEE చానెల్ దాదాపు రూ. కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి స్ట్రీమింగ్ భాగ‌స్వామిగా ZEE5 ఓటీటీతో డీల్ కుదుర్చుకుంద‌ని తెలుస్తోంది. ఆర్‌సీ 15 సినిమా షూటింగ్ లో తాను చాలా ఎంజాయ్ చేస్తున్న‌ట్టు రామ్ చ‌ర‌ణ్ ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఫ్యాన్ బాయ్‌గా సినిమాలో త‌న పాత్ర ప‌రిధి మేర‌కు న‌టిస్తున్నాన‌ని చెప్పారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ని చేయ‌డం ఆనందంగా ఉన్న‌ద‌ని పేర్కొన్న చ‌ర‌ణ్ క‌చ్చితంగా సినిమా చాలా బాగుంటుంద‌ని తెలిపారు.

Visitors Are Also Reading