Home » ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. ఇక నుంచి 4K క్వాలిటీతో మ్యాచ్ లు.. జియో సరికొత్త ప్లాన్స్..!

ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. ఇక నుంచి 4K క్వాలిటీతో మ్యాచ్ లు.. జియో సరికొత్త ప్లాన్స్..!

by Anji
Ad

ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ పండుగ కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ లోపు ఐపీఎల్ అభిమానులకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ అందించింది. 4K క్వాలిటీతో లైవ్ లో క్రికెట్ మ్యాచ్ లను వీక్షించేందుకు 6 కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్ లను చూసేందుకు ఈ ప్లాన్స్ మరింత సౌకర్యంగా మారనున్నాయి. వీటిలో మూడు ప్లాన్లకు కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు డేటా ప్రయోజనం కలిగిస్తుంది. మిగిలిన మూడు డేటా యాడ్ ఆన్ వోచర్స్ మాత్రమే. ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  వైర‌ల్ అవుతున్న తార‌క‌ర‌త్న చివ‌రివీడియో…చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వు..!

Advertisement

Advertisement

రూ.999 రీచార్జ్ తో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజు 100 ఎస్ఎంఎస్ లతో పాటు డైలీ 3జీబీ హై స్పీడ్ ఉచితంగా ఇస్తారు. వీటితో పాటు మరో రూ.241 డేటా యాడ్ అన్ వోచర్ ఉచితంగా లభిస్తుంది ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజుల వరకు ఉంటుంది. రూ. 399 రీచార్జ్ తో రోజూ 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు మరో రూ.61 విలువైన వోచర్ ప్లాన్ తో ఉచితంగా వస్తుంది. వ్యాలిడిటి 28 రోజుల వరకు ఉంటుంది. రూ.219 రీచార్జ్ తో3జీబి డేటా డైలీ, అపరిమిత కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు మరో రూ.25 విలువైన వోచర్ ఈ ప్లాన్ తో ఉచితంగా వస్తుంది. దీని వ్యాలిడిటి 14 రోజుల వరకు ఉంటుంది. 

Also Read :  భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఈ పనులు చేయండి !

డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ : 

డేటా యాడ్ ఆన్ వోచర్స్ బేసిక్ ప్రీ పెయిడ్ ప్లాన్స్ పై అదనపు డేటాను అందిస్తాయి. రూ.222 : 50 జీబీ డేటా ( వ్యాలిడిటీ ప్రస్తుత ప్లాన్ ఎక్స్ పైరీ గడువు) రూ.444 : 100 జీబీ డేటా వ్యాలిడిటీ 60 రోజుల వరకు, రూ.667 150 జీబీ డేటా వ్యాలిడిటి 90 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్స్ అన్ని కూడా మార్చి 24 నుంచి జియో యూజర్లకు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. 

Also Read :  మంచు మనోజ్ కి అనుచరుడిగా ఉన్న సారథి ఎవరో తెలుసా ? 

Visitors Are Also Reading