Telugu News » Blog » అలియా అభిమానులకు గుడ్ న్యూస్.. కవల పిల్లలంటూ లీక్ చేసిన రణబీర్ కపూర్..!!

అలియా అభిమానులకు గుడ్ న్యూస్.. కవల పిల్లలంటూ లీక్ చేసిన రణబీర్ కపూర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐదు సంవత్సరాలు ప్రేమాయణం నడిపిన జంట రన్ బీర్ కపూర్ మరియు ఆలియాభట్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు ఈ ఏడాది ఏప్రిల్లో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. పెళ్లి చేసుకున్న 3 నెలల్లోనే ఆలియా భట్ ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పింది. ఈ విషయం బయటకు రాగానే ఆలియాభట్ తను కమిట్ అయినటువంటి అన్ని సినిమాలను చాలా స్పీడుగా పూర్తి చేసుకుంటు వస్తుంది.

Advertisement

ఇదిలా ఉండగా రన్ బీర్ కపూర్ కూడా అనేక పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఈ సందర్భంలోనే ఈయన నటించినటువంటి బ్రహ్మాస్త్ర మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే ఆయన నటించిన మరో మూవీ షేంషేరా. ఈ మూవీ జూలై 22 వ తేదీన విడుదల కాబోతుండడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రన్బీర్ కపూర్ ను యాంకర్ కొన్ని ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా నేరుగా సమాధానమిస్తూ ఆలియా భట్ కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది అంటూ ఈ విషయాన్ని బయటపెట్టారు. రన్బీర్ కపూర్ ఈ విషయాన్ని లీక్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో అందరూ డబుల్ ధమాకా కొట్టబోతున్నాడంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Advertisement

ALSO READ:

You may also like